E-Paper
Advertisement

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!
Advertisement

Ravulapalem Couple:కాస్త కష్టం వస్తే చాలు ఆత్మహత్యలే శరణ్యమంటూ ప్రాణాలని తీసుకోవడం ఇపుడు చాలా కామన్ అయిపొయింది.తాజాగా ఇదే బాటలో మరో జంట బాదడం ఇపుడు ఆంద్రప్రదేశ్ లో సంచలనం స్పృష్టిస్తుంది.విషయంలోకి వెళ్తే .. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంలో విషాద ఘటన నమోదు అయింది..

రావులపాలెంలోని కొత్త కాలనీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఆదివారం ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర దుమారాన్ని రేపింది.

Advertisement

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఈ దంపతులు ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు? వీరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్నదానిపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం శివారులోని కొత్త కాలనీలో కర్రి నాగేశ్వరరెడ్డి (49), ఆయన భార్య కర్రి దుర్గాలక్ష్మి (42) నివాసం ఉంటున్నారు. దుర్గాలక్ష్మి చీటీ పాటల వ్యాపారం నిర్వహిస్తుండగా, ఆమె భర్త నాగేశ్వరరెడ్డి కూడా ఈ వ్యవహారాల్లో సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే వీరి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఈ మధ్య పెద్ద రచ్చ కి దారి తీశాయి. ఇదే కాలనీలో నివాసముంటున్న కొప్పిశెట్టి నాగ మల్లేశ్వరి అనే మహిళ గత నెల 31న ఆత్మహత్య చేసుకుంది.తనకు కర్రి దంపతులు రూ.15 లక్షలు బాకీ ఉన్నారని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆమె ఆరోపించినట్లు సమాచారం.

ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి నుంచే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ పసంఘటన జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్రి దంపతులు కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

ఆదివారం తమ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రావులపాలెం అర్బన్ సీఐ రమేష్ బాబు పరిస్థితిని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరోవైపు ఈ ఘటనలో బయటకు వచ్చినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. తమకు ఒక మహిళ నుంచి సుమారు రూ.కోటి రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ఆమె తిరిగి చెల్లించడం లేదని దంపతులు అందులో పేర్కొన్నట్లు సమాచారం.

తమకు రావాల్సిన డబ్బును వసూలు చేసి, తాము ఇతరులకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సూసైడ్ నోట్‌లోని వివరాలను పోలీసులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే అసలు విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఒకవైపు తమపై రూ.15 లక్షల బకాయి ఆరోపణలు.. మరోవైపు తమకు రూ.కోటి రావాల్సి ఉందంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొనడం.. ఈ రెండు అంశాలు ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని మరింత మలుపుతిప్పాయనే చెప్పాలి .

చీటీ పాటల వ్యాపారం చుట్టూ భారీగా డబ్బుల లావాదేవీలు జరిగాయా? ఎవరి దగ్గర ఎంత మొత్తం ఉంది? ఎవరెవరికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోందిఇక మృతులకు సతీష్ రెడ్డి, మమత సౌమ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

also read:వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

Big Stories

Advertisement
×