DSC Scam: డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని అనుమానం ఉందని శింగనమల వైసీపీ ఇంచార్జీ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. స్పోర్ట్స్ కోటాలో, దివ్యాంగుల కోటాలో అక్రమాలు జరిగాయని న్యాయమైన వారికి అన్యాయం జరిగిందని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయన్న దానిపై ప్రభుత్వం నుండి సమాదానం లేదని అన్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి.
స్పోర్ట్స్ కోటా పెట్టినప్పుడే అన్యాయానికి రాచబాట పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాటను స్పోర్ట్స్ లోకి చేర్చారు. జీవో నెంబర్ 4, 47లో ఉద్యోగం రావాలంటే పరీక్ష అవసరం లేదని చెప్పారని అన్నారు. ఆ జీవో చూస్తే భయమేస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, లోకల్ బాడీస్, యూనిఫామ్ కోర్సెస్‌లలో ఉద్యోగాలు ఇవ్వొచ్చని జీవోలో పేర్కొన్నారని అన్నారు. ఇష్టమొచ్చినట్టు ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో తెస్తారు. మళ్లీ సస్పెండ్ చేస్తారు. వీటిని తాత్కాలిక జీవోలు అనుకోవచ్చని అన్నారు. జరగని పోటీలకు సర్టిఫికెట్ తెస్తే ఉద్యోగం ఇచ్చారు. సమాధానం చెప్పమంటే ఎదురు దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
300 పైగా ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో అన్యాక్రాంతం జరిగాయని, తప్పులను ఎత్తి చూపితే బిగ్ టీవీ, సాక్షి , మీడియా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ఎవరిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. డీఎస్సీ, ఎపిపీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని సైలజానాథ్ డిమాండ్ చేశారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ కూడా ఇదే అని బిగ్ టీవీ చాలెంజ్ స్వీకరించలేక అకౌంట్లను బ్లాక్ చేశారని తేల్చి చెప్పారు.
Also read: కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ భారీ ధర్నా!