AP DSC Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే గత కొన్ని రోజులుగా డీఎస్సీ స్కామ్ సంచలనం రేపుతున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే తాజాగా మరో భారీ స్కామ్ బైటపడింది. స్పోర్ట్స్ కోటాలో అన్నా చెల్లెళ్లిద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయులుగా ఎన్నికవడం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో నంద్యాల, కర్నూలు జిల్లాలో భార్యాభర్తలకు ఒకే రకమైన జూడో పోటీల సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.
ఏపీలోని విజయనగరం జిల్లాలో అన్నాచెల్లెళ్లిద్దరూ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సొందారు. అయితే ఒకే కుటుంబంలో రెండు ఉద్యోగాలు రావంతో అక్కడి వారికి తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ నియామకాల్లో ఓకే రకమైన క్రీడా పోటీల్లో చూపించిన సర్టిఫికెట్ల ఆదారంగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పోందడం చర్చనియాంశంగా మారింది. అయితే ప్రస్తుతం క్రీడా రికార్డుల్లోనూ ఉద్యోగుల నివాస స్థలాల మార్పులు, పోటీల్లో పాల్గొన్న సమయానికి వారిద్దరూ చదివిన చదువులకు వ్యత్యాసాలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.
Also read: రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్
రాష్ట్రంలో క్రీడల్లో నిజంగా ప్రాతినిధ్యం వహించని వారికి అన్యాయం జరుగుతుందని కొంత మంది వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు అన్యాయం చేసి దొడ్డిదారిన వచ్చి బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్న వారి వల్ల అర్హులైన నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభర్దుల సర్టిఫికెట్లను అండర్‌టేకింగ్ ఫామ్‌లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విద్యాశాఖ అధికారులు పరిశీలించాలని ప్రభుత్వానికి ఏపీ డీఎస్సీ భాదితులు డిమాండ్ చేస్తున్నారు.