Amaravati: ఏపీ డీఎస్సీ-2025 వ్యవహారం ప్రకంపనలు కూటమిలో మొదలుకానున్నాయా? అధికార పార్టీ సైలెంట్ వెనుక ఏం జరుగుతోంది? బాధితులు మీడియా ముందుకు వస్తున్నా, జనసేన-బీజేపీలు ఎందుకు సైలంట్‌గా ఉన్నాయి? దీనిపై ఏపీలో రాజకీయాలు పార్టీలు ఏమంటున్నాయి?
డిఎస్సీ-2025 వ్యవహారం ఏపీలోని కూటమి మధ్య లుకలుకలు మొదలైనట్టు కనిపిస్తోంది. బిగ్ టీవీ వరుస కథనాలతో కూటమి సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది వైసీపీ. ఈ వ్యవహారంపై ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. కచ్చితంగా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మొదటి నుంచి వైసీపీ ఇదే వాదన చేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతీరోజూ వైసీపీ రియాక్ట్ అవుతోంది.
కూటమి ప్రభుత్వంలోవున్న టీడీపీ, తాము పారదర్శకంగా చేశామని చెబుతోంది. జనసేన-బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మద్దతుగా ఉండాల్సిందిపోయి కనీసం నోరు కూడా మెదపలేదు. మెగా డీఎస్సీని నిర్వహించిన ఘనత మాదేనని కూటమి గర్వంగా చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో స్పోర్ట్ కోటా కింద జరిగిన అక్రమాలను ఆధారాలతో బయటపెట్టింది బిగ్ టీవీ.
టీడీపీకి మద్దతుగా ఉండేందుకు ఆ రెండు పార్టీలు ఇష్టపడడం లేదా? ఎందుకు మౌనంగా ఉన్నాయి? కూటమిలో భాగస్వామిగా ఉండడంతోనే మాట్లాడ లేదా? అసెంబ్లీలో ప్రభుత్వం-ప్రజల పక్షం తామేనని చెప్పుకున్న జనసేన-బీజేపీలు, ప్రజల నుంచి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యాయని అనుకుంటున్నారు.
ALSO READ: AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో