BigTV English

2 crore cash seized: వామ్మో నోట్ల కట్టలు, అనంతపురంలో భారీ ఎత్తున..

2 crore cash seized: వామ్మో నోట్ల కట్టలు, అనంతపురంలో భారీ ఎత్తున..

2 crore cash seized in AP(Andhra news today): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న‌కొద్దీ నగదు, నగలు పంపిణీ తీవ్రమవుతోంది. పోలింగ్‌కు కేవలం 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే నుంచే నేతలు.. నగలు, నగదు పంపిణీలు మొదలుపెట్టేశారు వివిధ పార్టీల నేతలు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల సంఘం నియమించిన ప్లయింగ్ స్క్వాడ్ లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.


తాజాగా అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున నగదు పట్టబడింది. దాదాపు రెండు కోట్ల రూపాయలను ప్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. పోలీసుల తనిఖీల్లో భాగంగా అనంతపురం టౌన్ నుంచి కదిరి వైపు వెళ్తున్న పార్చునర్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. అందులో రెండు బ్యాగుల్లో తరలిస్తున్న కోటి 99 లక్షల 97, 500 రూపాయలను సీజ్ చేశారు. వాహనం రికార్డులను పరిశీలించగా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంటక ప్రసాద్ పేరున ఉంది.

డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పట్టుబడిన నగదును ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పోలీసులు అప్పగించారు. అనంతపురం ఒకేసారి ఈ రేంజ్‌లో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి అంటున్నారు. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అనుమానం వచ్చిన రాజకీయ పార్టీల కార్యకర్తల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×