Big Stories

CM Jagan Vs Sharmila Dialogue War: ప్రేమతో పంచ్ లు వేసుకుంటున్న అన్నా చెల్లెల్లు..

- Advertisement -

విన్నారుగా.. సీఎం జగన్‌ ఎలా బాధపడుతున్నారో.. ఆయనకు చెల్లెలిపై ఎంత ప్రేమ ఉందో.. ఆయన తెగ బాధపడిపోతున్నారు. షర్మిల ఓడిపోతున్నారని.. అసలు డిపాజిట్ కూడా రాదని ఏ పార్టీలైతే తన తండ్రి పేరును షార్జ్‌షీట్‌లో పెట్టారో.. అదే పార్టీ నుంచి తనపై పోటీ చేయడం సరైంది కాదు అంటున్నారు జగన్.. మరి అన్న బాధను చూసిన చెల్లి ఊరుకుంటుందా? ఊరుకోదు కదా.. వెంటనే సమాధానం ఇచ్చేసింది.

- Advertisement -

సో షర్మిల చెప్తున్నది ఏంటంటే.. అన్నయ్య నువ్వసలు బాధపడకు. అవినాష్‌ రెడ్డి నామినేషన్ విత్‌ డ్రా చేసుకుంటే ఇప్పటికైనా పోటీ నుంచి తప్పుకుంటా అని అంటుంది. సో ఇక తనపై విమర్శలు చేస్తే వదిలేదే లేదు. మాటకు మాటతోనే సమాధానం చెప్తా అన్నట్టుంది షర్మిల వ్యవహారం. నిజానికి ఏ రోజైతే షర్మిల, సునీతను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేశారో.. ఆ రోజు నుంచి షర్మిల విమర్శల డోస్‌ను పెంచేశారు. అసలు షర్మిల కడపలో ఎందుకు బరిలోకి దిగారు? వైసీపీ హయాంలో పాలన సరిగ్గా లేదనా? ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడం లేదనా? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ తెలియాలంటే ఆమె చెప్పింది ఓ సారి వినండి.

Also Read: వామ్మో నోట్ల కట్టలు, అనంతపురంలో భారీ ఎత్తున..

సో షర్మిల పోటీ చేసేది కేవలం అవినాష్‌ రెడ్డిని ఓడించడానికే.. అది కూడా తన చిన్నాన్నను హత్య చేశాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో అతని పేర్చు చేర్చిందని పోటీ నుంచి అవినాష్‌ తప్పుకుంటే ఆమె కూడా బరిలో నుంచి తప్పుకుంటుంది. మరి ఇదేం లెక్క.. పోటీ చేస్తే ప్రజల కోసం చేయాలి.. వారి బాగు కోసం పాటుపడాలి. అంతేకాని ఇంట్లో ఉన్న పంచాయితీ కోసం పోటీ చేయడం ఏంటన్నది కూడా అర్థం కావడం లేదు.

ఇవన్నీ పక్కన పెడితే.. కడప గడపలో రాజకీయం మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వైసీపీ క్యాంప్‌ చేసే ప్రతి విమర్శకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు షర్మిల.. వన్‌ ఉమెన్ షో చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఆమె ప్రచారం ఇప్పటికీ కూడా కుటుంబం చుట్టే తిరుగుతుంది. అయితే అన్నపై విమర్శలు లేదంటే చిన్నాన్న హత్య.. ఇవీ కాకుంటే రాజన్న బిడ్డను అని చెప్పడం.
ఇంతకు మించి ఆమె ప్రచారంలో మరో మాట వినిపించడం లేదు.

కానీ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్.. నేరుగా అధికార పార్టీని టార్గెట్‌ చేస్తుండటంతో ఆమె మాటలు పొలిటికల్‌గా సెగలు పుట్టిస్తున్నాయి. ఇటు కడప పరిధిలో కూడా షర్మిల ఎఫెక్ట్‌ కూడా గట్టిగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఆమె న్యూట్రల్‌గా ఉన్న ఎస్సీల ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుంది. ఎట్‌ ది సేమ్ టైమ్.. రాజన్న పేరును వాడి వైసీపీ అభిమానులను చీల్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడిదే వైసీపీ పెద్దలను కంగారు పెడుతుంది. అందుకే వారి ఫోకస్‌ను షర్మిలపై పెడుతున్నారు.ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కానీ ఆమె కూడా ప్రేమతో నీ చెల్లి షర్మిల అన్నట్టుగా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. మరి ఈ పరిణామాలు షర్మిలకు ఎంత ప్లస్‌ అవుతాయి? వైసీపీకి ఎంత మైనస్ అవుతాయి? అనేది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News