Amaravati: అర్నబ్ తుఫాను ధాటికి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు కకావికలమయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తోంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు నిత్యావసరాలు, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అర్నబ్ తుఫాను ఏపీకి అంతులేని నష్టాన్ని మిగిల్చింది. గురువారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. గురువారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన, శుక్రవారం వెస్ట్ గోదావరి జిల్లా వంతైంది. అమరావతి నుంచి నేరుగా హెలికాఫ్టర్లో పశ్చిమగోదావరికి వెళ్లనున్నాయి. అక్కడి నుంచి వాహనంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. బాధితులకు భరోసా ఇవ్వనుంది. నేరుగా వారితో మాట్లాడనున్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తుఫాను బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు సీఎస్ సాయిప్రసాద్ ఉత్వర్తులు జారీ చేశారు. నిత్యావసర వస్తువులను దాదాపు 20 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. మత్స్యకార, చేనేత కుటుంబాలకు 50 కిలోలు బియ్యం, ఇతరులకు 25 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. దీనికితోడు పామాయిల్, కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు, పంచదార ఇవ్వనున్నారు.
నిత్యావసరాలతోపాటు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి తక్షణ సాయంగా కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఒక వ్యక్తికి అయితే రూ.1,000 ఇవ్వనుంది. ఉభయగోదావరి జిల్లాలలో సహాయ, పునరావాస చర్యల నిమిత్తం రూ.4 కోట్ల నిధులు విడుదల చేశారు. తుఫాన్ సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా పర్యటన నుంచి వచ్చిన తర్వాత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు.
రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 3,33,268 హెక్టార్ల వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నట్లు ప్రాథమిక నివేదిక అందింది. అందులో తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఇదేగాకుండా 22,452 హెక్టార్ల ఉద్యాన పంటలపై తుఫాన్ ప్రభావం పడింది. ఉద్యాన పంటల విస్తీర్ణం సగం కోనసీమలో ఉన్నట్లు అంచనా. మరోవైపు ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా దెబ్బతిన్న 5,400 గ్రామాల్లో 4,771 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు అధికారులు. మరో 629 గ్రామాలకు ఇంకా విద్యుత్ పునరుద్ధరించాల్సి వుంది.
ALSO READ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు
ఆర్ అండ్ బీ పరిధిలో జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు 2,396 కిలోమీటర్ల మేరా దెబ్బతిన్నాయి. రహదారులపై కూలిన 2264 చెట్లను తొలగించారు సహాయక సిబ్బంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడిన 133 ప్రాంతాల్లో 99 చోట్ల రవాణాను పునరుద్ధరించారు. ఇది కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మాత్రమే. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో విద్యుత్, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.