E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: షాకిచ్చిన చందు.. వల్లికి ఘోర అవమానం.. చందు లైఫ్ లోకి కొత్త అమ్మాయి..

Illu Illalu Pillalu Today Episodes: షాకిచ్చిన చందు.. వల్లికి ఘోర అవమానం.. చందు లైఫ్ లోకి కొత్త అమ్మాయి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 30th : వల్లి తన ఇంట్లో బతుకమ్మ అని పెడుతూ తన జీవితం మారాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే తనకు ఫోన్ లో ఒక వీడియో వస్తుంది తన అత్తింటి వాళ్ళు అందరూ కలిసి బతుకమ్మ అని పెడుతున్నట్లు ఆ ఫోన్లో చూస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషంగా బతకమని పెడుతున్నారు నేను కూడా అక్కడే ఉండింటే బతుకమ్మని పెట్టేదాన్ని కదా అని బాధ పడిపోతూ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు అందరూ చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా.. అక్కడికి వచ్చిన భాగ్యం నువ్వు బతిమలాడి ఇలా బతుకమ్మను పెట్టి అక్కడ ఆడాలని చూస్తే వాళ్ళు నేను రానిస్తారా బెదిరించో భయపెట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ అంటుంది.. ఆ మాటకు వల్లి చాలా సీరియస్ అవుతుంది. నా సంగతి నేను చూసుకుంటాను నువ్వు మళ్ళీ వేలు పెట్టొద్దు అని వల్లి వార్నింగ్ ఇస్తుంది..

భద్ర ప్లాన్ ఇదేనా..?

భద్ర బయట రామరాజు ఇంట్లో ఏంట్రా ఇంత కళకళలాడుతుంది. మొత్తం అంతా నవ్వులే వినిపిస్తున్నాయి అని అడుగుతుంది. అయితే ఇవాళ బతుకమ్మ కదా అక్క అందరూ బతుకమ్మని తయారు చేసి.. బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారేమో అని అంటాడు అయితే బతుకమ్మ సంబరాలు ఇంట్లో జరగకూడదు రా వాడికి ఎంతగా అవమానించాలని చూసినా కూడా అందరూ నవ్వుకుంటూ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే వల్లికి చందు విడాకులు నోటిఫికేషన్ పంపించడం చూసి రామరాజుకి అక్కడే అవమానం జరిగేలా చేయాలి అని ప్లాన్ చేస్తుంది.

చందు ఎంట్రీ అంతా షాక్..

Advertisement

చందు ఇంకా రాలేదు అని అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ బతుకమ్మను తీసుకుని వెళుతూ ఉండగా ప్రేమని నువ్వు నడవలేవు కానీ నిన్ను కారులో తీసుకొని వెళ్తాను అని అంటాడు. అయితే ధీరజ్ ఎంత చెప్పినా సరే అసలు వినకుండా అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ ఒక్కటే నీకు ఇదా ఏంటి మేమందరం మనుషులం కాదా అని అంటారు ముఖ్యంగా వేదవతిని ఏడిపించేస్తుంది. ఈ తల్లి అంటే నీకు అసలు ఇష్టం లేదు కదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని బాధ పడిపోతుంది. బతుకమ్మను తీసుకెళ్లాలని అందరూ అనుకుంటారు అయితే అప్పుడే రామరాజు ఇంకా చందు రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే అప్పుడు సడన్గా చందు ట్రెడిషనల్ లుక్ లో బయటకు రావడం చూసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు.

రామరాజు పరువు తీసేందుకు ప్లాన్..

భద్రావతి రామరాజు పరువు తీయాలి ఎలాగైనా సరే అని ప్లాన్ చేస్తుంది. అయితే రామరాజు పరువు ని ఎలాగైనా సరే ఆ గుడిలోనే తీసేయాలి బతుకమ్మ అని సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆ సంబరాలు జరగకుండా ఆడి పరువు పోయేలా నేను చేస్తాను అని అంటుంది. ఆ భాగ్యం ని రెచ్చగొట్టి విడాకులు మేటర్ అక్కడే నేను తేలుస్తాను అని భద్ర అనుకుంటుంది. అయితే మొత్తానికి చందు ని అలాగే రామరాజుని అందరి ముందు అవమానించాలని భద్ర చేసే ప్లాను ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే అది సస్పెన్స్ గానే ఉంటుంది.

వల్లికి ఘోర అవమానం..

Advertisement

బతుకమ్మని గుడిలో పెట్టాలి అని వల్లి ఆఖరికి వెళ్తుంది ఇంకా తన కుటుంబం రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే నా కుటుంబంతో నేను కలవాలి అని అనుకుంటుంది. అయితే తన బతుకమ్మను తెచ్చి ఇంకా మా వాళ్ళు రాలేదు ఒకవేళ ఉంటే నేను ఎప్పుడో వాళ్ళతో పాటే ఉండేదాన్ని. నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. అయితే అప్పుడే రామరాజు కుటుంబం అక్కడికి వస్తుంది అది చూసిన వల్లి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక బతుకమ్మని తీసుకుని వస్తుండగా అప్పుడు వల్లి వల్ల దగ్గర పెట్టబోతుంటే ఎన్ని సార్లు చెప్పినా సిగ్గు అనేది లేదు అంటూ వల్లిని వేదవతి ఘోరంగా అవమానిస్తుంది. ఇది గుడి అత్తయ్య ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని నర్మదా అనగానే మళ్లీ మీ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి.

చందు లైఫ్ లోకి కొత్త అమ్మాయి..

చందు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిపోతుంది అయితే అతను మంచివాడు కాకపోవడంతో అతని వదిలేసి మళ్లీ తన పుట్టింటికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. అయితే ఆ ఊరు వాళ్ళు అందరూ కూడా ఆ అమ్మాయి జీవితం గురించి మాట్లాడడం విని చాలా బాధపడిపోతుంది. అయితే చందు గర్ల్ ఫ్రెండ్ మళ్లీ గుడిలో కనిపించడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘ఆదర్శకుటుంబం’ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడిందా..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర దశరథ ను వదిలేసి వెళ్లిపోతుందా..?     

Intinti Ramayanam Today Episode: భరత్ పై భానుమతి సీరియస్..అయ్యో రమ్య.. పల్లవికి వార్నింగ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode October 30th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సూసైడ్‌ ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందా..?       

గాజులు గలగలతో ఊపేసింది.. ఇప్పుడు ఈ డ్యాన్స్‌తో అడ్డంగా బుక్కైందా?

దేత్తడి హారిక నెల సంపాదన ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ కి పీరియడ్స్ వస్తే? విస్తుపోయే నిజాలు బయటపెట్టిన దక్షి!

Big Stories

Advertisement
×