E-Paper
Advertisement

గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు
Advertisement

LPG Gas Consumers: ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం చేసింది. ఇంకా చాలా ప్రాంతాలకు ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో ఓటీపీ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది కేంద్రం.

ఏపీలో గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్

అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు వేగవంతం చేసింది చంద్రబాబు సర్కార్. తుఫాను బాధితులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ ఇప్పుడిప్పుడే మొదలైంది. అయినా చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జిల్లాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, అక్కడి పరిస్థితిని తెలుసు కుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు రహదారులు భారీగా డ్యామేజ్ అయ్యింది.

గ్యాస్ సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

Advertisement

దీనికితోడు చెట్లు నేల కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు తొలగించడంతో రాష్ట్ర, జిల్లాల ప్రధాన కేంద్రాలకు వాహనాల రాకపోకలు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి చాలా కష్టంగా మారింది. రహదారులకుతోడు టెలిఫోన్ సదుపాయాలు డ్యామేజ్ అయ్యాయి.  ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో గృహ వినియోగదారులకు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయమై కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

తుపాను ప్రభావితమైన 13 జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరీకి OTP నుంచి తాత్కాలిక మినహాయింపు లభించింది. విద్యుత్, మొబైల్ నెట్వర్క్ సమస్యల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ విజ్ఞప్తితో వినియోగదారులకు ఊరట లభించింది. గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందేందుకు అనుమతి లభించింది. ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లాల వరకు ఈ మినహాయింపు లభించింది.

Advertisement

ALSO READ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

Related News

తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు.. ఉచితంగా నిత్యావసరాలు, రూ.3 వేలు సాయం

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. దూసుకొస్తున్న మరొక తుఫాను, వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు

అర్నబ్ తుపాను తాకిడికి అతలాకుతలమైన కోనసీమ.. రైతుల కళ్లల్లో కన్నీళ్లు!

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగండం.. తెలంగాణలో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట.. ఇసుక తిన్నెలను వడపోస్తున్న స్థానికులు!

Big Stories

Advertisement
×