E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు,  కొన్నింటికి టైమింగ్స్ మార్పు
Advertisement

Several Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. అర్నబ్ దెబ్బకు ఏపీ కకావికలమైంది. రోడ్డు, విద్యుత్ వ్యవస్థలే కాకుండా రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలోని వివిధ చోట్ల భారీ వర్షాలు పడుతుండడం, ట్రాక్ సరిగా లేకపోవడంతో పలు రైళ్లు రద్దు చేసింది రైల్వేశాఖ. మరికొన్ని రైళ్లు టైమింగ్స్ మార్చింది.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్

అర్నబ్ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించింది. వర్షాలకు బలమైన గాలులు తోడుకావడంతో అంతులేని నష్టాన్ని మిగిల్చింది. కేవలం పంటలు మాత్రమే మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు భారీగా డ్యామేజ్ అయ్యింది. అటు రైల్వేపై తీవ్రంగా చూపింది. బుధవారం నుంచి పలు రైళ్లు రద్దు చూస్తూ వస్తోంది రైల్వేశాఖ.

Advertisement

శుక్ర, శనివారాల్లో కూడా పలు రైళ్లు రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్ని టైమింగ్స్ మార్చారు. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు బయలుదేరే ముందు తాము ఎక్కబోయే రైలు వివరాలను చెక్ చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నది సమీప రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. రైల్వే బ్రిడ్జి సమీపంలో ట్రాక్‌ కింద పిల్లర్లు దెబ్బతిని రాళ్లు కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి.

శుక్ర, శనివారాల్లో పలు రైళ్లు రద్దు

ఈ విషయం తెలియగానే విశాఖపట్నం నుంచి రైల్వే సిబ్బంది వచ్చి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం పలు రైళ్లు రద్దయ్యాయి. భువనేశ్వర్‌ నుంచి విశాఖ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేసింది. మద్రాస్ టు భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20854), తిరుపతి నుంచి పూరి వెళ్లే ఎక్స్‌ప్రెస్(17480) రైళ్లు రద్దు అయ్యాయి.

Advertisement

శనివారం నాలుగు రైళ్లు, ఆదివారం మరొక రైలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. వివిధ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015) నిర్ణీత సమయం ఉదయం 8.00 గంటలకు బదులుగా 30న ఉదయం 10.30 గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేశారు అధికారులు.

ALSO READ: ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. దూసుకొస్తున్న మరొక తుఫాను, వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు

 

Related News

ఏపీలో గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు.. ఉచితంగా నిత్యావసరాలు, రూ.3 వేలు సాయం

ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. దూసుకొస్తున్న మరొక తుఫాను, వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు

అర్నబ్ తుపాను తాకిడికి అతలాకుతలమైన కోనసీమ.. రైతుల కళ్లల్లో కన్నీళ్లు!

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగండం.. తెలంగాణలో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట.. ఇసుక తిన్నెలను వడపోస్తున్న స్థానికులు!

Big Stories

Advertisement
×