ఏపీ తీరం వైపునకు మరో తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో అది మళ్లీ అల్పపీడనంగా మారే అంకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అక్టోబర్ 31 నాటికి అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను నవంబర్ 2 నాటికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశం ఉందరి అధికారుల తెలిపారు.
ఇప్పటికే దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం ఉదృతంగా కదులుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఇది మరింత భలపడే అవకాశం ఉందని సమాచారం. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో పాటు ఏపీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ప్రస్థుతం ఛత్తీస్‌గఢ్-ఒడిశా మధ్య అర్నబ్ తుఫాన్ బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సాయంత్రానికి సాధారణ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీంతో నేడు అక్కడక్కడ తేలికి పాటి వర్ఫాలే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో రేపటి నుండి మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయి. దీంతో రేపు ఉత్తర, మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 5 వరకు తెలంగాణ అంతటా మరిన్ని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా నవంబర్ 2 నుండి 5 వరకు మంచి వర్షాలు పడవచ్చని అధికారులు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో వచ్చే వారం రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుసార్లు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: హుజురాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివాదం.. కోర్టు ఉత్తర్వులున్న భూమిలో నిర్మాణం!