Brahmamudi serial today Episode: దుగ్గిరాల ఇల్లు మొత్తం తన కంట్రోల్ లోకి వచ్చిందని రేఖ బిల్డప్ కొడుతుంది. రేఖ చిటిక వేయగానే.. పని మనిషి కాఫీ తీసుకొస్తుంది. అది చూసిన బ్రమరాంబ చాలు రేఖ నీ పరపతి పెరిగిపోయింది. అన్నింటి కంటే నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా..? ఏ ఇంటిని అయితే కాపాడటానికి కవచంలా ఆ రాజు గాడు వచ్చాడో అదే ఇంటి నుంచి వాడిని తరిమేసి ఇందు జుట్టును నీ చేతిలో పెట్టుకున్నావు చూడు అంటూ మెచ్చుకుంటుంది. శేషు ఆలోచిస్తుంటే.. రేఖ చూసి ఏంటన్నయ్య ఇలాంటి టైంలోనే నువ్వు ఏదో ఒకటి అనాలి. అది నేను వినాలి అనండి అంటూ చెప్తే అనాలని ఉంది కానీ విని తట్టుకునే శక్తి మీకు ఉందా..? అంటాడు శేషు.
చెప్పు పర్వాలేదు నువ్వు అనడం మేము వినడము పరిపాటే కదా చెప్పండి అంటుంది. అయితే చెప్తాను వినండి రాజు ఇంట్లోంచి వెళ్లిపోతున్నా ఇందు మౌనంగా ఎందుకు ఉంది. ఆ మౌనం వెనక ఏ గూడార్థం దాగి ఉంది. అంటే మనం అనుకున్నట్టు కాకుండా ఇంకేదో జరుగుతుందని నాకు కొడుతూనే ఉంది అంటే.. భ్రమరాంబ కోపంగా అనుకున్నా ఇలాంటి దరిద్రం ఏంటో నీ నోటి నుంచి వస్తుందని అనుకున్నాను అంటుంది. అన్నయ్యను ఏమీ అనొద్దు వదిన అన్నయ్య అబ్జర్వ్ చేసిన విషయంలో కూడా ఏదో అర్థం ఉంది. తన మౌనానికి మీనింగ్ ఇంకేదో కాదు అన్నయ్య కంపెనీ లాస్లోకి వెళ్తుందని ఆస్థులు కరిగిపోతాయని బతుకులు రోడ్డున పడతాయని అంటుంది రేఖ.
మీకు అలా అర్థం అయిందా..? ఇందు ఆస్థుల కోసం భయపడే రకం కాదు.. ఇంకా ఏదో ఎక్కడో కొడుతూనే ఉంది అంటాడు. శత్రువును పొగడటం నీకు అలవాటు అయిపోయింది అన్నయ్య అంటూ రేఖ చెబితే.. నిజాలు మాట్లాడటం నాకు అలవాటు అంటాడు శేషు. నువ్వు నా పవర్ ఏంటో మర్చిపోయావు అంటుంది రేఖ.. ఇందు పవర్ నువ్వు గుర్తించలేదేమో అంటాడు శేషు. దీంతో శేషును కోపంగా తిడుతుంది భ్రమరాంబ. రేఖ మాత్రం తన ఆడబోయే గేమ్ నీకు నచ్చుతుంది అన్నయ్య రేపే ఇందుకు పెళ్లి చూపుల ఏర్పాటు చేస్తున్నాను.. త్వరలోనే పెళ్లి కూడా చేస్తాను తర్వాత నేను ఆడే గేమ్ ఎలా ఉంటుందో నువ్వే నీ కళ్లతో చూస్తావు అంటుంది రేఖ.
చలపతిని ఇంట్లో లక్ష్మీ తిడుతుంది. రాజు ఎప్పటికైనా ఆ ఇంటి వారసుడు. ఆ ఇంటికి చేరాల్సిన వాడే అయినా మీరు రాజును తీసుకొచ్చి ఏం సాధిద్దామనుకున్నారు. మీకు ఇచ్చిన మాట కోసం అపర్ణ గారు, ఇందు నిన్ను ఒక్క మాట అనలేదు. వాళ్లు నిజం చెప్పి ఉంటే నువ్వే ఏం చేసేవాడివి అంటూ ప్రశ్నిస్తే.. చలపతి ఎమోషనల్ అవుతాడు. రాజుకు అన్ని నేర్పాము.. వాడికి అన్ని నేర్పాము.. నువ్వు వాడిని ఆ ఇంటి బిడ్డగా చూస్తున్నావు.. కానీ నేను మన బిడ్డగా చూస్తున్నాను.. అంటాడు. ఇద్దరి మధ్య రాజు గురించి వాదన జరుగుతుంది. చివరికి చలపతి కోపంగా వాడి గురించి ఎక్కువ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు అంటూ లక్ష్మీని పంపిస్తాడు. రాజు దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు ఈ పాలైన తాగు అంటే రాజు వద్దని లోపలికి వెళ్లిపోతాడు.
లక్కీ రూంలో కూర్చుని బాధపడుతుంటాడు. ఒక ఫ్రెండ్‌గా తప్పు చేశాను. రాజు నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను వెనకేసకొచ్చావు.. కానీ నేను తప్పు చేశాను. అంటూ బాధపడుతుంటే.. ఐశ్వర్య వచ్చి నువ్వు చేసింది కరెక్టే.. ఒక భర్తగా నీ భార్యను వెనకేసుకురావడంలో నువ్వు సక్సెస్ అయ్యావు.. లక్కీ ఇప్పుడు చెప్తున్నాను.. నువ్వు చాలా లక్కీ.. ఈ ఐశ్వర్య దృష్టిలో పడ్డావు ఈ టెంపోను ఇలానే మెయింటెన్ చేయ్ ఏమో నా విషయంలో నువ్వు కన్న కలలు నిజం చేసుకుంటావు.. అంటూ వీడు నా సర్కిల్‌లోనే ఉండాలంటే ఈ మాత్రం సోంపు వేయాలి అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది ఐషు.
రేఖ ఒక ఫోటో తీసుకెళ్లి అపర్ణకు చూపిస్తూ ఫోటో ఎలా ఉంది ఆంటీ.. అంటుంది. ఎవరిది ఈ ఫోటో అని అపర్ణ అడిగితే.. ఇందుకు పెళ్లి చేయడానికి ఈ అబ్బాయిని చూశాను అని చెప్తుంది రేఖ. ఆల్‌రెడీ పెళ్లి చూపులకు వస్తున్నారని చెప్తుంది. అంతా విన్న ఇందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రూంలోకి వెళ్లి రెడీ అవుతుంటే.. ఐశ్వర్య వెళ్లి తిడుతుంది. అపర్ణ వెళ్లి ఐశ్వర్యను తిడుతుంది. పిచ్చిపిచ్చిగా వాగావంటే పళ్లు రాలగొడతాను అంటూ ఐశ్వర్యను అక్కడి నుంచి వెళ్లగొట్టి ఏం చేస్తున్నావే నువ్వు పెళ్లి చూపులకు రెడీ అవ్వడం ఏంటి..? అని అడిగితే.. నా మెడలో తాళి కట్టేది బావే.. ఎవరు పెళ్లి చూపులు పెట్టినా..? పెళ్లికి ఏర్పాట్లు చేసినా నేను పెళ్లి చేసుకోబోది నా బావ రాజునే.. నా బావ నాకోసం వస్తాడు. తనే నా మెడలో తాళి కడతాడు అంటూ చెప్తుంది.
ఇంట్లో బాధపడుతూ ఉన్న రాజును లక్ష్మీ ఓదారుస్తుంది. చలపతి తిడుతుంటాడు. ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే నందు వెళ్లి నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు రాజు. కానీ అక్కడ మా అక్క అసలు బాగాలేదు. నీ షాక్ లోంచి బయటకు రాలేకపోతుంది అంటూ బాధపడుతుంది. అక్కకు ఈరోజు పెళ్లి చూపులు అక్కకు వేరే వాడితో పెళ్లి చేయాలని ఆ రేఖ ఆంటీ డిసీజన్ తీసుకుంది. ఈ విషయం చెబుదామని వచ్చాను అంటుంది నందు. రాజు షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.