Anantapur News: అనంతపురం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను అరవై ఏళ్ల వృద్ధుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఫ్యామిలీ రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవిస్తోంది. ఆ ఇంటికి యజమానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. అయితే భర్త మరణించడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. రెండో కూతురికి 16 ఏళ్లు.
బాలిక ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడు గుమ్మఘట్ట మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన 60 ఏళ్ల రామాంజనేయులు. ఎలాగైనా బాలికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు బాగానే జరిగింది. రామాంజనేయులకు రెండేళ్ల కిందట భార్య మరణించింది. ఓ కొడుక్కి పెళ్లి చేశాడు. పెళ్లికి సిద్ధంగా కూతురు ఉంది. కూతురుకి పెళ్లి చేసి పంపిస్తే తన బతుకు ఏంటని ఆలోచించాడు.
తనకు తోడుగా ఉండేందుకు యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. మైనర్ బాలిక విషయం తెలిసింది. ఏప్రిల్‌లో బాలిక ఇంటికి వెళ్లాడు రామాంజనేయులు. మీ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులను కోరాడు. అందుకు వారు నిరాకరించాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన రామాంజనేయులు, వారిని బెదిరించాడు. ఇంటి బయట బాలిక మెడలో బలవంతంగా తాళి కట్టాడు.
ALSO READ: రాష్ట్ర పర్యటనకు షర్మిల శ్రీకారం.. చిత్తూరు నుంచి మొదలు
మరుసటి రోజు బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. దెబ్బలు భరించలేని బాలిక, రామాంజనేయులు ఇంటి నుంచి తప్పించుకుంది. మరింత రెచ్చిపోయిన రామాంజనేయులు ఈనెల 24న బంధువులతో కలిసి బాలిక ఇంటిపై దాడి చేశాడు. బాలిక తల్లి, తండ్రి, అక్కను చితకబాదారు. బాలికను బలవంతంగా ఓ వాహనంలో తీసుకెళ్లాడు. అనంతరం బాలికను ఒకచోట నిర్బంధించాడు.
శనివారం రాత్రి ఆ వృద్ధుడి చెర నుంచి తప్పించుకుంది మైనర్ బాలిక. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ ఒకచోట సేద తీరింది. సోమవారం స్థానికుల సహాయంతో అనంతపురం ఎస్పీ ఆఫీసుకు చేరుకుంది. రామాంజనేయులు చేసిన వ్యవహారాన్ని బయటపెట్టింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, రామాంజనేయులు దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతడు లేకపోవడంతో వెనుదిరిగారు.