ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పైలెట్లకు కొత్త మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది. రీసెంట్ గా ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 200 మంది ప్రయాణీకులకుతో వెళ్లే ఇండిగో విమానంలో అల్లకల్లోలం ఏర్పడింది. ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. ఈ నేపథ్యంలో పైలెట్లు వెంటనే శ్రీనగర్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అత్యవసర పరిస్థితి గురించి వివరించారు. ఏటీసీ అనుమతితో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో పరిస్థితులను ప్రయాణీకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానం ఊగుతున్నప్పుడు ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దేవుడి మీద భారం వేసి ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపించింది.
ఘనటనపై దర్యాప్తు మొదలుపెట్టిన DGCA
ఇండిగో విమాన ఘనటపై DGCA అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా పైలెట్లకు కీలక మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తెలిపారు. విమాన ప్రయాణాలు సురక్షితంగా కొనసాగేలా తగిన జాగ్రత్తలు ఇందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీనగర్ కు వెళ్లే విమాన కేసు దర్యాప్తులో పూర్తి కావచ్చినట్లు తెలిపారు. అయితే, అటువంటి అల్లకల్లోల పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేయడానికి కొంత సమయం పట్టవచ్చన్నారు. ఇందుకోసం స్టేక్‌హోల్డర్లతో విస్తృత సంప్రదింపులు అవసరమని అధికారులు వెల్లడించారు.
Read Also: ప్రపంచంలో క్లీనెస్ట్ ఎయిర్ పోర్టులు ఇవే, చిన్న చిత్తు కాగితం కూడా కనిపించదు!
ఆ సమయంలో స్పష్టమైన ఆపరేటింగ్ విధానం అవసరం
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు పైలట్లు స్పష్టమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం కలిగి ఉండాలని DGCA అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియకు సమగ్ర విశ్లేషణ అవసరం అన్నారు. ఇటీవలి సంఘటన తర్వాత ఇద్దరు పైలట్లను DGCA జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. ఓవర్ ఫ్లైట్ వాతావరణ మళ్లింపు అభ్యర్థన కోసం లాహోర్ విమానాశ్రయ కాంటాక్ట్ ఫ్రీక్వెన్సీని పౌర విమాన పైలట్లకు IAF అందించిందని తెలిపారు. అయితే, ఆ అభ్యర్థనను పాకిస్తాన్ అధికారులు తిరస్కరించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పైలెట్లు తుఫాన్ లోనే ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించారని, ఫలితంగా వడగళ్ల తుఫాను, తీవ్రమైన అల్లకల్లోలంలో ప్రయాణం ముందుకుసాగిందన్నారు. ప్రతికూల పరిస్థితుల నడుమ, విమానం ముందు భాగం దెబ్బ తిన్నప్పటికీ, 220 మందితో కూడిన విమానాన్ని శ్రీనగర్‌లో ల్యాండ్ చేయగలిగారని వెల్లడించారు. ఒకానొక సమయంలో, విమానం నిమిషానికి 8500 అడుగుల వేగంతో కిందకు దిగినట్లు తెలిపారు. ఇది సాధారణ దిగే రేటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అన్నారు. ప్రస్తుతం పైలెట్ల పైనా విచారణ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైతే వారి పేర్లను DGCA నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించేలా నిర్ణయాలు తీసుకున్న పైలెట్లపై విచారణ అనంతరం తప్పు అని తేలితే, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: భారీ వర్షాలకు పలు రైళ్లు రద్దు, మీ వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి!