BigTV English

A.P.cm Chandrababu: బాబు ప్లాన్ వర్కవుట్ అయితే ఏపీ కి నిధుల కొరత ఉండదిక..

A.P.cm Chandrababu: బాబు ప్లాన్ వర్కవుట్ అయితే ఏపీ కి నిధుల కొరత ఉండదిక..

A.P.cm Chandrababu plan to give private partnership for welfare schemes: ఏపీ ప్రజలు చంద్రబాబు రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. జగన్ పాలనలో రాజధాని,పోలవరం రెండూ పూర్తికాలేదు. పైగ నిరుద్యోగ సమస్య..ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ కూటమిని గెలిపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు అనుభవంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు.అనేక పరిశ్రమలను ఆహ్వానించి రాజధాని హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా చేశారు. అందుకే ఆర్థికంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ప్రస్తుతం చంద్రబాబు లాంటి అనుభవమున్న నేత అవసరం ఎంతైనా ఉందని ఏపీ ప్రజలు భావించారు. చంద్రబాబు కూటమికి అధికార పీఠం అప్పగించారు.


బాబును చూసి నవ్వుకున్నారు

అందరూ అప్పులపాలైన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు మాత్రం ఏం చెయ్యగలడు అనుకున్నారు. ప్రతిపక్షాలు కూడా నవ్వుకున్నాయి. ఇప్పటికీ మళ్లీ తమ ప్రభుత్వం వస్తేనే ఏపీకి సరైన న్యాయం జరగగలదని ప్రచారం చేస్తున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ఎలాగైనా బయటపడేయాలంటే ఏదైనా అద్భుతాలు జరగాలి. లేదా కేంద్రం అన్ని రాష్ట్రాల నిధులను ఏపీకి తరలించాలి. ఇవి రెండూ జరిగేవి కావు. అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారు. అది కనుక వర్కవుట్ అయితే కేంద్రం దయాభిక్ష కూడా అవసరం లేదు. స్వయంసమృద్ధి రాష్ట్రంగా ఏపీ ఎదగనుంది.


ప్రైవేట్ మంత్ర

ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఏపీ ఆర్థిక కష్టాలనుంచి విముక్తి కలిగించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మొన్నటి ఆగస్టు 15న ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఒక్కో క్యాంటీన్ ఒక్క పూటకి రూ.25 వేలు ఖర్చు అవుతుందని అంచనా..రెండు పూట్ల కలిపితే అది రూ.50 వేల ఖర్చవుతుంది. ఇప్పటికి ఉన్న వంద క్యాంటీన్లకు తోడు మరో వంద కలిపి మొత్తం 200 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు సంవత్సరానికి రూ.250 కోట్లు ఖర్చుకానున్నాయి. తెలివిగా చంద్రబాబు ఈ ఖర్చును విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. అన్నదానానికి అంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు.

దాతల సహకారం

ఇప్పటికే ఈ పథకానికి తమ వంతు విరాళాలు ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించవలసిన పనిలేదు. వీటి నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి.అలాగే మరో పథకం పైనా దృష్టిపెట్టారు చంద్రబాబు. జగన్ కు చెడ్డపేరు తెచ్చిన రోడ్ల నిర్వహణ ఆ ప్రభావం ఓట్ల శాతం తగ్గడానికి దోహదమయింది. ఏపీలో మారుమూల పల్లెలలో రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు వీటి నిర్వహణ కూడా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లకు ఇవ్వడం ద్వారా చేతికి మట్టంటకుండా చేయాలని చూస్తున్నారు చంద్ర బాబు. ఇలా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఏర్పాటు చేసి టోల్ గేట్ ల ఏర్పాటు ద్వారా మళ్లీ వాళ్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో అటు రోడ్లు బాగుపడతాయి..ఇటు నిధుల కోసం ఎవరిపైనా ఆధారపడనక్కర్లదు.

నిధులపై ఆధారపడనక్కర్లేదు

రీసెంట్ గా ఓ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను అపోలో ఆసుపత్రి మేజేజ్ మెంట్ కు అప్పగించారు. వాళ్లు కూడా కమర్షియల్ ఫీజులు వసూలు చేయకుండా నామమాత్రపు ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఇంకా వీటితో పాటు ప్రైవేటు భాగస్వామ్యం లో పలు విద్యా సంస్థలు, కళాశాలలు, యూనివర్సిటీలను కూడా చేర్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు సరికొత్త ఆలోచన కు అంతా జేజేలు పలుకుతున్నారు. ప్రైవేటు భాగస్వామ్యం అనే అంశం కొత్తది కాకపోయినా..గతంలో చాలా మంది అవకతవకలకు పాల్పడ్డారు. ప్రవేటు భాగస్వామ్యాన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగిస్తే ఇక ఆ పథకాలకు లోటే ఉండదు. ఇదే తరహాలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులపైఆధారపడక్కర్లేదు. దటీజ్ చంద్రబాబు..సోషల్ మీడియాలో చంద్రబాబుకు అంతా జేజేలు పలుకుతున్నారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×