BigTV English

Crime News: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. గమనించిన యువతి.. ఆ తర్వాత.. ?

Crime News: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. గమనించిన యువతి.. ఆ తర్వాత.. ?

Crime News: మాటువేశాడు.. మానవ మృగంగా మరి ఐదేళ్ల బాలికపై కన్ను వేశాడు. అత్యాచార యత్నానికి పాల్పడే క్రమంలో స్థానికుల చేతికి చిక్కి.. చివరికి కటకటాల పాలయ్యాడు. శ్రీకాళహస్తి పట్టణం సంత మైదానం వద్ద ఓ ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టేసి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంచలనంగా మారిన ఈ ఘటనతో స్థానికులంతా వీధిలో గుమికూడారు.. . గుర్తుతెలియని యువకుడు, బాలిక ను లాక్కొని వెళ్తూ ఉండగా.. స్థానిక యువతి గుర్తించి అందర్నీ అప్రమత్తం చేయడంతో ఘటన వెలుగు చూసింది.


ముక్కు పచ్చలారని ఓ చిన్నారిపై కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నిస్తుండగా.. స్థానికులు గుర్తించి అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికులు అందించిన తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని సంత మైదానం వద్ద వీధిలో ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలికను ఓ గుర్తు తెలియని యువకుడు లాక్కొని వెళ్తూ ఉండగా, ఆ వైపు వెళ్తున్న స్థానిక యువతి సుబ్బలక్ష్మి గుర్తించి.. వెంటనే చుట్టుపక్కల స్థానికులకు సమాచారం ఇచ్చింది.

ఈలోపే ఆ యువకుడు.. చిన్నారిని నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్ది పైకి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నిస్తుండగా.. స్థానికులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే విద్యుత్ స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. అనంతరం శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే బాలిక తల్లిదండ్రులను, స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: Sri Sathya Sai Incident : హిందూపురంలో దారుణం… స్పందించిన బాలకృష్ణ ఏమన్నారంటే!

దసరా పండుగ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇరువురు మహిళలపై.. అత్యాచారం ఘటన సంచలనం కలిగించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సీఎం చంద్రబాబు, హోమ్ మంత్రి వంగలపూడి అనితలు కూడా వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. హిందూపురం ఎమ్మేల్యే బాలకృష్ణ కూడా.. జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకొని, నిందితులను త్వరగా పట్టుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు కావడంతో.. పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ కావడంతో.. త్వరగానే నిందితులను పోలీసులు పట్టుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×