BigTV English

Sri Sathya Sai Incident : హిందూపురంలో దారుణం… స్పందించిన బాలకృష్ణ ఏమన్నారంటే!

Sri Sathya Sai Incident : హిందూపురంలో దారుణం… స్పందించిన బాలకృష్ణ ఏమన్నారంటే!

Sri sathya Sai Incident : శ్రీ సాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని నల్ల కోమల పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అత్తా, కోడలిపై గుర్తు తెలియని దుండగులు హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ దారుణం పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం స్పందించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని.. మరో సారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.


నేటి సమాజంలో అన్యాయాలు, అక్రమాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడవారి పై అత్యాచారాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోవడంతో స్త్రీలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు చోట్ల అత్యాచారాలు జరిగి ఎందరో మహిళలు అన్యాయం అయిపోగా… తాజాగా సత్య సాయి జిల్లా నల్ల కోమల పల్లిలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలపై అత్యాచారం చేయటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ఈ ఘటన ఒక నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్ మెన్ గా పని చేస్తున్న కుటుంబంపై జరిగింది. అర్ధరాత్రి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు… వాచ్మెన్ కొడుకును కత్తులతో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న అత్తా కోడళ్లను లాక్కెళ్లి, వారిపై అత్యాచారం జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


ALSO READ : ప్రజా అభివృద్ధే ధ్యేయంగా సీఎం ప్రయత్నాలు.. నిత్యావసర సరుకులపై కీలక నిర్ణయం

ఇక ఈ ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు జరిగి ఆడవారు అన్యాయం అయిపోతున్నారని.. ఇక తన సొంత నియోజకవర్గంలో పండగ పూట ఇలాంటి ఘటన జరగటం దారుణమని వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ రత్నాతో మాట్లాడిన బాలకృష్ణ.. కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి తాను పూర్తిగా అండగా ఉంటానని.. ఇకపై ఎలాంటి దారుణం జరగకుండా రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం ఈ ఘటన సమాజంలో బలమైన నిరసనని రేపుతున్నది. ఇలాంటి దారుణాలు ఎక్కడకక్కడ జరుగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వంతోపాటు యంత్రాంగం సైతం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అత్యాచారాలు ఆగటం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యాచారాలపై కొత్త చట్టాలు కఠిన శిక్షలు వచ్చినప్పటికీ మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మహిళలు ప్రతి చోట అన్యాయానికి గురవుతున్నారని ఇకపై పోలీసులు నిఘా పెంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఇలాంటి వాటిలో కొందరికి మాత్రమే న్యాయం జరుగుతుందని ఎందరో అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి వెంటనే నిందితుల్ని అరెస్టు చేయాలని అభ్యర్థిస్తున్నారు

Related News

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

Big Stories

×