BigTV English

Mamitha Baiju: తెలుగులో ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు మొదటి సినిమా, ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్

Mamitha Baiju: తెలుగులో ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు మొదటి సినిమా, ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్

Mamitha Baiju: ఒక భాషలో హీరోయిన్‌కు పాపులారిటీ వచ్చిందంటే చాలు.. ఆ హీరోయిన్‌ను ఎలాగైనా టాలీవుడ్‌లో పరిచయం చేయాలని టాలీవుడ్ మేకర్స్ క్యూ కడతారు. అలాగే ‘ప్రేమలు’ సినిమాతో మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మమితా బైజు. అది డబ్బింగ్ సినిమానే అయినా.. మమితాకు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. దీంతో తనకు టాలీవుడ్ నుండి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్ని సెలక్ట్ చేసుకుంది కూడా. ఇప్పుడు తను సెలక్ట్ చేసిన అన్ని సినిమాల్లో ఒక తెలుగు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్.. దసరా సందర్భంగా విడుదలయ్యింది.


తనవల్లే హైప్

దినేష్ బాబూ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డియర్ కృష్ణ’ అనే సినిమాతో మమితా బైజు.. తెలుగులో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను దసరా సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. దాంతో పాటు ఫస్ట్ లుక్ వీడియోను కూడా విడుదల చేశారు. ‘కృష్ణుడి అసలైన మ్యాజిక్‌ను అదే మనిషితో రీక్రియేట్ అయ్యింది. తనే అక్షయ్’ అంటూ ఈ వీడియోలో హీరో గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇక ‘డియర్ కృష్ణ’ మూవీలో మమితా బైజుతో పాటు ఐశ్వర్య ఉల్లాస్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది.


Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పటికీ నా ఫేవరెట్ సినిమా.. హాలీవుడ్ నటి ప్రశంసలు

ఫస్ట్ లుక్‌తో క్లారిటీ

‘డియర్ కృష్ణ’ సినిమాను దినేష్ బాబూ డైరెక్ట్ చేయడంతో పాటు డైలాగ్స్, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇక దీనికి కావాల్సిన కథను పీ ఎన్ బలరామ్ అందించారు. అంతే కాకుండా ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన సొంత బ్యానర్ అయిన పీఎన్‌బీ సినిమాస్‌తో ‘డియర్ కృష్ణ’ను నిర్మించనున్నారు. ఈ సినిమాకు హరి ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ వీడియోలో హరి ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ‘ప్రేమలు’లో మమితా బైజును చూసి.. తనను నేరుగా తెలుగులో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ‘డియర్ కృష్ణ’ ఫస్ట్ లుక్‌తో ఒక క్లారిటీ వచ్చింది.

ఎందుకిలా చేశావు మమితా?

మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళంలో కూడా ‘ప్రేమలు’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మమితాకు తెలుగులో కూడా ఛాన్సులు రావడం మొదలయ్యింది. జీవీ ప్రకాశ్ హీరోగా నటించిన ‘రెబెల్’తో కోలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యింది మమితా. ఈ సినిమాను నికేశ్ ఆర్ఎస్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసినా జీవీ ప్రకాశ్ హీరో కావడంతో ఈ సినిమాకు బాగానే రీచ్ వచ్చింది. కానీ ఇప్పుడు మమితా టాలీవుడ్ డెబ్యూతో ప్రేక్షకులు అంత తృప్తిగా లేరు. ఎందుకంటే ‘డియర్ కృష్ణ’ మూవీకి సంబంధించిన డైరెక్టర్ గానీ, హీరో గానీ ఇంతకు ముందు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కొన్నాళ్లు ఆగితే మమితాకు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చేదేమో అని, అనవసరంగా తెలుగులో తన డెబ్యూ కోసం ఒక చిన్న సినిమాను సెలక్ట్ చేసుకుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×