E-Paper
Advertisement

Actor Mohan Babu: నటుడు మోహన్‌బాబుకు కష్టాలు.. అరెస్టు తప్పదా? ఏం జరిగింది?

Actor Mohan Babu: నటుడు మోహన్‌బాబుకు కష్టాలు.. అరెస్టు తప్పదా? ఏం జరిగింది?
Advertisement

Actor Mohan Babu: సినీ నటుడు మోహన్‌బాబుకు మళ్లీ కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఆయన అరెస్టు తప్పదా? కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించిందా? ఈ వ్యవహారంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తారా? లేకుంటే ఇక్కడే ఆగిపోతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

నటుడు మోహన్‌బాబుకు కష్టాలు.. హైకోర్టు బిగ్ షాక్

Advertisement

మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌ల‌ర్, నటుడు మోహన్‌బాబు‌కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రధాన నిందితుడితో ఫోన్ కాల్స్, మెసేజ్‌లపై న్యాయస్థానం ఆరా తీసింది. అంతేకాదు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అసలేం జరిగింది?

తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు ఆరోపణలకు దిగాయి. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. అదే సమయంలో ధర్నాకు బయల్దేరిన విద్యార్థి సంఘం నేతలు కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారం కాస్త ముదిరిపాకాన పడింది.

Advertisement

కిడ్నాప్ కేసులో ఆయన అరెస్టు ఖాయం?

భగ్గుమన్న మిగతా విద్యార్థి సంఘం నాయకులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగాయి ప్రత్యేక బృందాలు. చివరకు నారావారిపల్లి సమీపంలోని భీమవరం ఏరియాలో కిడ్నాపర్ల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కిడ్నాపర్ల నుంచి విద్యార్థి సంఘం నేతలను విడిపించడం, ఆపై కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాపర్లు అంతా మోహన్‌బాబు యూనివర్సిటీ బౌన్సర్లుగా గుర్తించిన పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుతో మోహన్‌బాబు మీద కేసు నమోదు చేశారు. పరిస్థితి గమనించిన మోహన్‌బాబు ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టు తలుపుతట్టారు. ఆయనకు అక్కడా చుక్కెదురైంది.

ALSO READ:  నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

విద్యార్థి సంఘాల నాయకుల కిడ్నాప్‌కు ముందు ఆ తర్వాత ప్రధాన నిందితుడు యూనివర్సిటీ పీఆర్వో ఫోన్లో మాట్లాడారని, మెసేజ్‌లు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. ఫోన్ కాల్స్‌తో పాటు మెసేజ్‌ల‌ను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు ఇలాంటి దశలో ఉన్నప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది.

అరెస్ట్‌తోపాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్‌బాబు అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతేకాదు అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది.  క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి మూడుకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు.

 

 

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×