E-Paper
Advertisement

Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు
Advertisement

Nagababu MLC: ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదిక‌గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేటి విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల శారీరక వికాసాన్ని విస్మరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నాలుగు గోడల మధ్య బందీలుగా మారి కేవలం పుస్తకాలతోనే కాలం గడుపుతున్న చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆటలు వ్యాయామాలు లేకపోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మహత్య ధోరణులు పెరుగుతున్నాయని ఇది సమాజానికి పెను ముప్పు అని హెచ్చరించారు.

విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలే సరైన మార్గమని నాగబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థికి వారంలో కనీసం మూడు రోజులైనా ఫిజికల్ ఫిట్నెస్ క్రీడలు ఇతర పాఠ్యేతర కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు. క్రీడా మైదానాలు లేని ప్రైవేట్ విద్యా సంస్థల వల్ల పిల్లలు శారీరక దారుఢ్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన చెందారు. కేవలం ర్యాంకుల వేటలోనే విద్యార్థులను ఉంచుతున్నారని ఫలితంగా వారు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

ప్రైవేట్ విద్యార్థులకు క్రీడా సదుపాయాలు కల్పించడానికి ‘కామన్ ప్లే గ్రౌండ్ సిస్టం’ (CPS) అనే వినూత్న విధానాన్ని ఆయన సభలో ప్రతిపాదించారు. ప్రభుత్వ మున్సిపల్ జిల్లా పరిషత్ పాఠశాలలకు ఉన్న విశాలమైన మైదానాలను ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని కోరారు. ఇందుకు గాను ప్రైవేట్ యాజమాన్యాల నుంచి కనీస రుసుమును వసూలు చేయాలని సూచించారు. ఈ విధానం వల్ల అటు ప్రభుత్వ పాఠశాలలకు ఆదాయం ఇటు ప్రైవేట్ విద్యార్థులకు ఆటస్థలం లభిస్తుందని వివరించారు. దీనివల్ల ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన సఖ్యత కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ సంస్థల నుంచి వసూలు చేసే రుసుమును ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగించవచ్చని నాగబాబు సూచించారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ ఇతర మెయింటెనెన్స్ పనుల కోసం ఈ నిధులను వాడుకోవచ్చని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ యోగా వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. శారీరక సాధన వల్ల ఒత్తిడి తగ్గి విద్యార్థులు మానసికంగా దృఢంగా మారుతారని పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి క్రీడలు అందుబాటులో ఉండేలా సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలని విన్నవించారు. చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. సభలో చేసిన ఈ సూచనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరలోనే అమలు చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Read Also: Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×