BigTV English
Advertisement

Puli Seetha: రోజా.. శ్యామలకు చుక్కలు చూపిస్తున్న పులి సీత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Puli Seetha: రోజా.. శ్యామలకు చుక్కలు చూపిస్తున్న పులి సీత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Puli seetha: ఇటీవల మాజీ మంత్రి రోజా, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారో లేదో, వెంటనే ఈ నటి నుండి కౌంటర్స్ తెగ వస్తున్నాయి. అది కూడా అన్నీ రాపిడ్ కౌంటర్స్ అని చెప్పవచ్చు. రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలపై వైసీపీ విమర్శలు చేస్తుండగా.. అనూహ్యంగా తెరపైకి వచ్చారు ఈ నటి. ఆమె ఎవరో కాదు నటి పులి సీత. పులి సీత అంటే గుర్తు పట్టలేకున్నారా.. అదేనండీ రీల్స్ రాణిగా కూడా ఈమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకు ఎవరు ఈ పులి సీత? ఎందుకు కౌంటర్ అటాక్ చేస్తున్నారో తెలుసుకుందాం.


ఎవరు ఈ పులి సీత..
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పెద్దబ్బి పురం గ్రామానికి చెందిన పులి సీత డిగ్రీ విద్యను అభ్యసించారు. అయితే ఈమెకు ఏఎస్ పేటకు చెందిన ఉదయ్ కుమార్ తో 18 ఏళ్ల వయస్సులోనే వివాహమైంది. అయితే సింగర్ కావాలన్నది సీత కోరిక. కానీ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన సీత, తన భర్తతో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు మకాం మార్చారు. అందానికి అందం, అభినయం గల సీతకు సినిమాలలో అవకాశాలు అనూహ్యంగా వచ్చాయి. తన భర్త సహకారంతో సీత ఇప్పటికి సుమారు 25 సినిమాలలో నటించారు.

ఏ ఏ సినిమాలో తెలుసా..
ఎఫ్3, జయ జయ జానకి, వినయ విధేయ రామ, టచ్ చేసి చూడు, దేవర, లాంటి ప్రముఖ సినిమాలలో కూడా సీత నటించింది. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇచ్చిన అవకాశంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సీత, జయ జయ జానకి సినిమాలో నటించి తన నటనతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. సింగిల్ టేక్ లో ఏ సీన్ లో ఐనా ఇలా నటించే శక్తి గల సీత దేవర సినిమాలో కూడా నటించారు. త్వరలో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా ఈమెకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.


కమిట్మెంట్ అడగరు.. ఆ సంస్కృతి లేనే లేదు..
తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఓ ఇంటర్వ్యూలో సీత మాట్లాడుతూ.. టాలెంట్ ఉంటే చాలు, సినీ ఇండ్రస్ట్రీలో అవకాశాలు వస్తాయన్నారు. తనకు ఇప్పటి వరకు కమిట్మెంట్ అనే పదం కూడా తెలియదని, ఆ సంస్కృతి టాలీవుడ్ లో లేదన్నారు. ఒక సోదరి భావంతో అందరూ తనను గౌరవిస్తూ.. అవకాశాలు కల్పిస్తున్నట్లు సీత తెలపడం విశేషం.

పవర్ స్టార్ పవన్ కు వీరాభిమాని..
తాను మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు వీరాభినంటూ సీత చెబుతుంటారు. బాల్యం నుండి మెగాస్టార్ అంటే తనకు ఎనలేని అభిమానమని, అలాగే పవర్ స్టార్ కు కూడా అభిమానిగా మారారట సీత. కరోనా కాలంలో చిరంజీవి చేసిన సాయం అంతా ఇంతా కాదని, చేసిన సాయం చెప్పుకోవడం మెగాస్టార్ కుటుంబంలో లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read: Duvvada Srinivas Biopic: దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్.. రంగంలోకి ఆర్జీవీ

అనూహ్యంగా రాజకీయ విమర్శలు..
ఇటీవల పులి సీత తన సోషల్ మీడియా పేజీల ద్వారా.. మాజీ మంత్రి రోజా, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలలపై పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారారు. మొన్న శ్యామల కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసిన విమర్శలపై, సీత ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అలాగే రోజా కూడా రాష్ట్రంలో మహిళలలకు రక్షణ లేదని, కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించారు. దీనితో పులి సీత, రోజాపై ఘాటు కామెంట్స్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రం ప్రశాంతంగా ఉందా.. హత్యలు, నేరాలు ప్రభుత్వానికి చెప్పి జరగవని, కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎప్పటికప్పుడు స్పందిస్తూ చర్యలు తీసుకుంటారన్నారు. రోజా బుర్ర.. పీత బుర్ర అంటూ.. ఇటువంటి వారి వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, రోజా చెన్నై నుండి ఎందుకు మాట్లాడుతావు అంటూ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో అధిక ఫాలోవర్స్ గల సీత చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ కి, అభిమానులు సైతం జేజేలు పలుకుతున్నారు.

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×