BigTV English

Bigg Boss 8 Day 51 Promo: నామినేషన్ వైలెన్స్.. పృథ్వీ దెబ్బకు అవినాష్ షాక్..!

Bigg Boss 8 Day 51 Promo: నామినేషన్ వైలెన్స్.. పృథ్వీ దెబ్బకు అవినాష్ షాక్..!

Bigg Boss 8 Day 51 Promo.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) 51వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే తాజాగా ప్రోమోని విడుదల చేయగా.. ఈ ప్రోమో నామినేషన్ రచ్చతో మారుమ్రోగిందని చెప్పవచ్చు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ ప్రారంభం అవ్వగా.. అప్పుడే 7 వారాలలో 8 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఎనిమిదవ వారానికి సంబంధించి నామినేషన్ రచ్చ మొదలయ్యింది. కంటెస్టెంట్స్ కూడా ఎప్పుడు కూల్ గా కనిపించేవారు నామినేషన్స్ వచ్చేసరికి ఫుల్ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు నామినేషన్స్ పాయింట్స్ తీస్తూ తెగ రెచ్చిపోయారు.


ప్రేరణను హౌస్ నుంచి వెళ్ళిపోమన్న విష్ణు ప్రియ..

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. ఎనిమిదో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ లో భాగంగా.. గంగవ్వ మెహబూబ్ కుండ పలగొట్టగానే అంత కోపం ఉందా నా మీద అని అడగ్గా.. అంత కోపం ఏం లేదు కానీ అన్నీ చెప్పలేను అంటూ తప్పుకుంది. ఆ తర్వాత యష్మీ మాట్లాడుతూ.. విష్ణు ప్రియ నీ ఇండ్యూస్వల్ గేమ్ నాకు కనిపించట్లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ నుంచి వచ్చే కొన్ని మాటలు చాలా కఠినంగా ఉంటున్నాయి అంటూ యష్మీ చెప్పగా.. దీనికి విష్ణుప్రియ మాట్లాడుతూ.. నువ్వు నాకు రెండు మూడుసార్లు నవ్వద్దు అని చెప్పిన చోటే నాకు చాలా కోపం వచ్చింది అంటూ విష్ణు ప్రియ తెలిపింది. అది కాదు కిచెన్ విచారణలో అని యష్మీ చెప్పగా.. విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే సీత దిగిపోవడానికి కూడా కారణం ప్రేరణ అని విష్ణుప్రియ అనగా.. మధ్యలో కలగజేసుకొని ప్రేరణ మీకు తెలియదు విష్ణు అని కామెంట్ చేసింది. వెంటనే విష్ణు ప్రియ కూడా నాకు తెలుసు నాకు సీత చెప్పింది అంటూ వాదించింది విష్ణు ప్రియ. దీంతో యష్మీ మధ్యలో మెగా చీఫ్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ తో ఇది నా ఎలిమినేషన్ నన్ను మాట్లాడినవ్వకుండా వీరు గొడవ పడుతున్నారు ఏంటి అంటూ కామెంట్ చేసింది. దీంతో ప్రేరణ పేరు తీయకుండా మాట్లాడమని చెప్పు అని అడిగితే.. దానికి విష్ణుప్రియ అలా ఎలా హౌస్ నుంచి వెళ్ళిపో అంటూ కామెంట్ చేసింది. దీనితో ప్రేరణ నువ్వు ఎవరు చెప్పడానికి అంటూ ఫైర్ అయ్యింది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం కాసేపు గట్టిగానే జరిగింది.


పృథ్వీ రాక్స్.. అవినాష్ షాక్..

ఆ తర్వాత అవినాష్ పృథ్వి మధ్య గొడవ తారస్థాయికి చెందింది.. అవినాష్ నామినేషన్ లో భాగంగా.. బిగ్బాస్ కి ఫ్రీగా వచ్చావా అని అడగ్గా.. కాదు అంటూ పృథ్వి తెలిపాడు. మరి బిగ్ బాస్ లో ఆడి మనీ తీసుకుంటావు కానీ బిగ్బాస్ లో ఇచ్చే మని తీసుకోవు ఎందుకు.. హెయిర్ కట్ చాలెంజ్లో వెనక్కి తగ్గావ్ అంటూ నామినేట్ చేయగా.. మరి నువ్వు ఎందుకు లక్ష రూపాయలు కట్ చేయించుకోవచ్చు కదా.. రూ .50 వేలకే కమిట్ అయ్యావు అని పృథ్వీ ఎదురు ప్రశ్నించాడు. దీనికి నా ఇష్టం అని అవినాష్ చెప్పగా.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ కామెంట్ చేశారు.మొత్తానికైతే పృథ్వీ దెబ్బకి అవినాష్ షాక్ అయ్యాడు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.Bigg Boss 8 Day 51 Promo.. హెయిర్ కట్ విషయంలో అవినాష్ పృద్వీ మధ్య గొడవ స్థాయికి చేరిందని చెప్పవచ్చు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×