E-Paper
Advertisement

Anam On KCR: నీకు నచ్చితే ఎంత? నచ్చకపోతే ఎంత ?.. కేసీఆర్ పై ఆనం హాట్ కామెంట్స్

Anam On KCR: నీకు నచ్చితే ఎంత? నచ్చకపోతే ఎంత ?.. కేసీఆర్ పై ఆనం హాట్ కామెంట్స్
Advertisement

Anam On KCR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌కు ఏపీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయనేది అంతా ప్రచారమేనని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని మంత్రి ఆనం అన్నారు. చంద్రబాబు స్టేట్స్‌మెన్‌ అని ప్రపంచమంతా కీర్తిస్తోందన్నారు. కేసీఆర్‌కి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అన్నారు.

ఏపీ రామ రాజ్యం

ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం రామనారాయాణ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. కేసీఆర్ వ్యా్ఖ్యలు బాధించాయన్నారు. అలాగే దుర్మార్గమైన పనులతో కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షం ఉందని వైసీపీని ఉద్దేశించి అన్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. 2025లో కూటమి ప్రభుత్వం అందించిన సుపరిపాలనలో తాను భాగస్వామి కావటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని

Advertisement

కొందరు నేతలు సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని మంత్రి ఆనం ఆరోపించారు. కొత్త ఏడాదిలో కూడా ప్రజలకు మెరుగైన‌ పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లు పంపిణీ చేశామన్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకి రూ.వెయ్యి కోట్లకి పైగా ఖర్చు చేశామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6310 కోట్లు జమ చేశామన్నారు.

Also Read: కేసీఆర్-కేటీఆర్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్.. ఫామ్‌హౌస్‌లో ఏ బ్రాండ్ తాగొచ్చారో..

గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు

Advertisement

దీపం పథకం-2 కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2684 కోట్లు ఖర్చు అయిందన్నారు. పింఛన్లకు గత ఏడాది రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేద, నిరుపేదలకి అన్నం లేకుండా చేసిందని విమర్శించారు. త్వరలో గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×