E-Paper
Advertisement

Paanch Minar on OTT : మరో ఓటీటీలోకి రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ… న్యూ ఇయర్ కానుకగా

Paanch Minar on OTT : మరో ఓటీటీలోకి రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ… న్యూ ఇయర్ కానుకగా
Advertisement

Paanch Minar on OTT : థియేటర్లలోకి వచ్చిన వారంలోపే ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చిన ఘనత సొంతం చేసుకుంది రాజ్ తరుణ్ హీరోగా నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘పాంచ్ మినార్’. థియేటర్లలో అట్టర్ ప్లాఫ్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు తాజాగా మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఇయర్ ఓటీటీలోకి వచ్చిన మొదటి మూవీ గా మరో రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమాను ఏ ఓటిటిలో చూడొచ్చో తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పాంచ్ మినార్’ (Paanch Minar) అనే కామెడీ క్రైం థ్రిల్లర్ నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చింది. అయితే థియేటర్లలో అలా రిలీజ్ అయిందో లేదో డిజాస్టర్ తో ఓటీటీలో అడుగు పెట్టింది. నవంబర్ 28 నుంచి ఈ మూవీ ప్రైమ్ వీడియో (Prime video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో పాటు రాశి సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, సుదర్శన్, శ్రీనివాసరెడ్డి, రవి వర్మ తదితరులు నటించారు. రామ్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. జనవరి ఒకటి నుంచి ఆహా తెలుగులో ‘పాంచ్ మినార్’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుండడం గమనర్హం. అంతేకాకుండా ఆహా (aha) ఓటీటీలో ఈ ఏడాది వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనర్హం.

Advertisement

Read Also :  ఓటీటీలోకి భారతదేశం చంద్రునిపైకి చేసిన చారిత్రాత్మక ప్రయాణం… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

కథలోకి వెళ్తే…

ఇందులో హీరో పేరు కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు. తన ప్రేయసి ఖతికి తో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టుగా అబద్ధం చెప్తాడు. కానీ అతను క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తాడు. ఓ రోజు కిట్టు క్యాబ్ లో ఇద్దరు కిరాయి హంతకులు ఎక్కుతారు. హీరో కళ్ళముందే గ్యాంగ్ స్టర్ చోటుని మర్డర్ చేస్తారు. ఈ హత్య చేసినందుకు ఆ కిరాయి గుండాలకు ఐదు కోట్లు వచ్చి పడతాయి. ఈ క్రమంలోనే వాళ్ళు పోలీసులకు చిక్కడం, అంతలోనే చేతికిందని డబ్బు మాయం కావడం జరుగుతుంది. మరి ఇంతకీ ఐదు కోట్ల రూపాయలు ఎవరు తీశారు? కిరాయి హంతకులకు ఎవరు సుపారీ ఇచ్చారు? దీనివల్ల కిట్టు ఎలాంటి కష్టాల్లో పడ్డాడు? అతని పట్టుకోవడానికి హంతకులతో పాటు సిఐ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు ? ఈ సినిమాకు ‘పాంచ్ మినార్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? చివరికి 5 కోట్లు ఎవరి చేతికి చిక్కాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో వీక్షించాల్సిందే. ఇక ఇప్పటికే వరుస డిజాస్టర్లతో బాధపడుతున్న రాజ్ తరుణ్ ఖాతాలో ఈ సినిమాతో మరో డిజాస్టర్ వచ్చి పడింది. కానీ విచిత్రంగా ఈ మూవీని ఏకంగా రెండు ఓటీటీలు స్ట్రీమింగ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ మీరు గనక ఇలాంటి క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడితే కచ్చితంగా ఓ లుక్కెయ్యండి.

Tags

Related News

కోరిక తీరింది.. కానీ ప్రాణం పోయింది! హారర్ థ్రిల్లర్ లవర్స్ అవ్వొద్దు..

ఓటీటీ లోకి ‘అవతార్ 3’ వచ్చేస్తుంది.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగంటే..?

హత్య చూసిన తర్వాత ఊపిరి బిగబట్టే ఉత్కంఠ… ఊహించని మలుపులతో వణుకు పుట్టిస్తున్న మూవీ

వియన్నా హైజాక్ వెనుక ఉన్న అసలైన విలన్ ఎవరు?… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సినిమా

రూమ్‌మేట్‌ హత్యతో ఐదేళ్లు శిక్ష… జైలుపాలైన కూతురి కోసం సముద్రాలు దాటిన ఓ తండ్రి కథ

ఇలాంటి యాక్షన్ సినిమాలే దుమ్ము లేపేది… ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది

అంతరిక్షంలో అబ్బురపరిచే మిస్టరీ… ఓటిటిలో అదరగొడుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా

ఆ ఇంట్లో ఏదో ఉంది… మంత్రగత్తె మాయలో పడ్డ తోబుట్టువులు… ప్రాణాలతో బయటపడతారా?

Big Stories

Advertisement
×