BigTV English

Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్ధృతం.. ఎమ్మెల్యే‌ల ఇళ్ల ముట్టడికి యత్నం..

Andhra Pradesh: ఆంధ్ర‌ప్రదేశ్‌లో అంగన్వాడీల పోరు ఉధృతంగా సాగుతుంది. ఏపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని జగన్‌ సర్కార్‌ తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల ను ముట్టడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం ఎమ్మెల్యేల ఇంటి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్ధృతం.. ఎమ్మెల్యే‌ల ఇళ్ల ముట్టడికి యత్నం..

Andhra Pradesh: ఆంధ్ర‌ప్రదేశ్‌లో అంగన్వాడీల పోరు ఉధృతంగా సాగుతుంది. ఏపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని జగన్‌ సర్కార్‌ తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్లను ముట్టడిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం ఎమ్మెల్యేల ఇంటి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆందోళనల్లో భాగంగా ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఇంటి వద్ద పోలీసులకు అంగన్‌వాడీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు.


నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వరకు ర్యాలీ‌గా వెళ్లారు. తర్వాత మంత్రి ఇంటి ముందు నిరసన చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటిని ముట్టడించడాని అంగన్వాడీ కార్యకర్తలు ఆమె నివాసం వైపు వెళ్తుడంగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటిని ముట్టడించి తమ డిమాండ్ లు తీర్చాలని నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే వారిని నిలువరించారు. ఈ సందర్భంలో పోలీసులుకి అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళ సృహ తప్పి పడిపోయింది. బాపట్ల ఎమ్మల్యే కోన రఘపతి ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×