The Girl Friend film Release: నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇటీవల కాలంలో ఎంతో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాల పట్ల కూడా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్రలో, నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రష్మిక ఒక కాలేజీ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మికకు జోడిగా దసరా ఫేమ్ కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)హీరోగా నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సమర్పణలు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, ఇతర అప్డేట్స్ సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసాయి. అయితే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా తెలియజేశారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి.
ఇక సెప్టెంబర్ నెలలో పెద్ద ఎత్తున టాలీవుడ్ నుంచి సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వెనకడుగు వేసింది. అయితే నేడు చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గీత ఆర్ట్స్ అధికారికంగా వెల్లడించారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక వీడియోని కూడా విడుదల చేశారు.ప్రస్తుతం ఈ వీడియో కూడా అందరిని ఆకట్టుకుంటుంది.
WHO IS YOUR TYPE?
Let's have this conversation with #TheGirlfriend in theaters from NOVEMBER 7th, 2025 ✨
In Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam ❤️ #TheGirlfriendOnNov7th#WhoIsYourType@iamRashmika @Dheekshiths @23_rahulr @HeshamAWMusic… pic.twitter.com/e0mJht9RPH
— Geetha Arts (@GeethaArts) October 4, 2025
ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి ఇది వరకు “నదివే” అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకి ఎంతో అద్భుతమైన ఆదరణ లభించింది. ఇటీవల “ఏం జరుగుతోంది” అంటూ సెకండ్ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండు పాటలకు ఎంతో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. ఇలా రష్మిక ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక రష్మిక చివరిగా కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించారు. ఇక ఇందులో నాగార్జున కూడా కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక కుబేర తర్వాత ది గర్ల్ ఫ్రెండ్ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
Also Read: Rashmika -Vijay Devarakonda: విజయ్ రష్మిక నిశ్చితార్థం పై టీమ్ క్లారిటీ .. పెళ్లి పై బిగ్ అప్డేట్!