India ODI Captain: కెప్టెన్సీ విషయంలో అందరూ ఊహించిందే జరిగింది. మొన్నటి వరకు వన్డే కెప్టెన్ గా ( India ODI Captain ) ఉన్న రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ). తాజాగా వన్డేల్లో టీమిండియా కు కొత్త కెప్టెన్ ను నియామకం చేసింది. రోహిత్ శర్మను ( Rohit Sharma) తప్పించి…. ఆ బాధ్యతలను యంగ్ కుర్రాడు శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) కు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈనెల 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలోనే గిల్ కు కెప్టెన్సీ అప్పగించింది. అదే సమయంలో ఈ 3 వన్డేల సిరీస్ కు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ( Virat Kohli) అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
యంగ్ కుర్రాడు గిల్ కు వరసగా అవకాశాలు ఇస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్ గా ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… తాజాగా వన్డే కెప్టెన్ గా కూడా అతని పేరు ఫైనల్ చేసింది. మొన్నటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ ఏజ్ పై పడడం, ఇతర కారణాల వల్ల అతన్ని పక్కకు పెట్టింది బీసీసీఐ. ఇవాళ ప్రత్యేకంగా రోహిత్ శర్మతో సమావేశం అయిన తర్వాత కెప్టెన్ గా ప్రకటించింది. మళ్లీ రోహిత్ శర్మ అభిమానులు హర్ట్ కాకుండా… ముందు జాగ్రత్తలు పడే ప్రయత్నం చేసింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియా గడ్డపై ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ సిరీస్ కోసం.. రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తొలగించిన బీసీసీఐ…. వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ను ప్రకటించింది. కోహ్లీని కూడా తుదిజట్టులోకి తీసుకోనున్నారు. వన్డేల్లో షమీ, రవీంద్ర జడేజా, సంజూ శాంసన్ కు మాత్రం అవకాశం రాలేదు.
గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయాస్ ( వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాష్టింగన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, జురెల్ (వికెట్ కీపర్), జైస్వాల్
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
🚨IT’S OFFICIAL🚨
Shubman Gill – ODI Captain.
Shreyas Iyer – ODI Vice Captain.Rohit to play as a specialist batter. pic.twitter.com/6Jwm3BOetp
— Kanav Bali (@Concussion__Sub) October 4, 2025
🚨 INDIA ODI SQUAD vs AUSTRALIA 🚨
Gill (C), Rohit, Kohli, Shreyas (VC), Axar, Rahul, Nitish, Washi, Kuldeep, Harshit, Siraj, Arshdeep, Prasidh, Jurel (WK), Jaiswal pic.twitter.com/1FVTTHq7Kl
— Johns. (@CricCrazyJohns) October 4, 2025