Srinidhi shetty: శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కేజిఎఫ్ (KGF)సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటివరకు కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ ప్రధాన పాత్రలో నటించిన కే జి ఎఫ్ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి సైతం అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. కే జి ఎఫ్ సినిమా తర్వాత ఈమెకు పెద్ద ఎత్తున సౌత్ సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమె త్వరలోనే తెలుసు కదా(Telusukada) అనే సినిమా ద్వారా రాబోతున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీనిధి శెట్టి ప్రభాస్ (Prabhas)గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన స్నేహితులందరూ కూడా తనని “లేడి ప్రభాస్” (Lady Prabhas)అని పిలుస్తారు అంటూ శ్రీనిధి శెట్టి వెల్లడించారు. తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండను. ఇక ప్రభాస్ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని నేపథ్యంలో తనని అందరూ కూడా లేడీ ప్రభాస్ అని పిలుస్తారంటూ శ్రీనిధి చెప్పడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు షాక్ అవుతున్నారు.
శ్రీనిధి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి అంటూ ఫన్నీగా కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం లేడీ ప్రభాస్ అనే పదం కేవలం అనుష్కకి మాత్రమే సెట్ అవుతుందంటూ డార్లింగ్ ఫాన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమెను ప్రభాస్ తో పోల్చుకుంటూ ఈ వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచారు. ఇక తెలుసు కదా సినిమా విషయానికి వస్తే..
ఆ వార్తలన్నీ అవాస్తవం..
కోనా నీరజ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈమె ఖండించారు. ఈ సినిమా విషయంలో నన్ను ఎవరు సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సినిమాలో నటించమని నన్ను కోరితే తప్పకుండా తాను ఈ సినిమాలో నటిస్తాను అంటూ శ్రీనిధి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
Also Read: The Girl Friend film Release: రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ విడుదల తేదీ ఫిక్స్.. ఏకంగా ఐదు భాషలలో?