Zubeen Garg: ప్రముఖ అస్సామీ స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న జుబీన్ గార్గ్ మరణంపై రోజుకొక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సింగపూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లిన ఈయన సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అనుకోకుండా సముద్రంలో పడిపోయారట. దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అయి హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నార్త్ అభిమానులే కాదు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ కూడా ఈయన మరణం పై అనుమానాలు వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే ఆయన తన మరణానికి ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదు. పైగా మంచి ఈతగాడు కూడా.. అలాంటిది హఠాత్తుగా సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.
అందుకే సీఎం ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని.. ఆయన మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చి.. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు రెండవసారి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. అంతేకాదు ఈయన మరణానికి గల కారణాలను వెంటనే తెలియజేయాలి అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా చాలా సీరియస్ గా సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. సిట్ తేల్చలేకపోతే సిబిఐ దర్యాప్తుకి కూడా ఆదేశిస్తాను అంటూ ఆయన తెలిపారు. రంగంలోకి దిగిన సిట్ బృందం కొన్ని గంటల్లోనే కీలక విషయాలను బయటపెట్టింది. జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ , ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్కాను మహంత, కో సింగర్ అమృత్ ప్రవ, బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామిని అరెస్టు చేశారు.
పైగా జుబీన్ గార్గ్ ఈత కొడుతున్న దృశ్యాలు కో సింగర్ అమృత్ ప్రవ తన మొబైల్ లో రికార్డు చేసింది. ఈ వీడియోలు దర్యాప్తుకు చాలా కీలకంగా మారాయి. ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన విషయాలను బయటపెట్టారు. మేనేజర్ సిద్ధార్థ శర్మ విషమిచ్చి చంపినట్లు ఆయన వెల్లడించారు. “హోటల్ దగ్గర నుంచి బోటింగ్ వరకు సిద్ధార్థ శర్మ ప్రవర్తన చాలా భిన్నంగా అనిపించింది. బోటింగ్ ను నావికుడి దగ్గర నుంచి సిద్ధార్థ శర్మ తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో సముద్రం మధ్యలో చాలా గందరగోళానికి గురయ్యాడు. బోటులో స్వయంగా సిద్ధార్థ శర్మ పానీయాలు అందించాడు. పైగా మమ్మల్ని ఎలాంటి ఆహారం అందించొద్దు అని కూడా సూచించాడు. ఈతకు దిగకముందే విష ప్రయోగం జరిగింది. ఈతకు దిగిన తర్వాత ఎవరు దగ్గరకు వెళ్ళొద్దని సిద్ధార్థ శర్మ మాకు సూచించాడు. పైగా ఈతకు సంబంధించిన వీడియోలను కూడా ఎవరికి షేర్ చేయొద్దని చెప్పాడు. ఈ విషయం బయటపడకుండా ఉండడానికి విదేశీ మధ్యాహ్నం ఏర్పాటు చేయడమే కాకుండా.. అమ్మాయిల సరఫరా కూడా సిద్ధార్థ చూసుకున్నాడు” అంటూ ఆయన తెలిపారు.
ఇక మొత్తానికైతే జుబీన్ గార్గ్ ది హత్య అని, ఆయన ప్రమాదంలో చనిపోలేదు అని విషమిచ్చి చంపేశారు అని గోస్వామి మాటలతో అర్థం అయిపోయింది. సిద్ధార్థ శర్మ జుబీన్ గార్గ్ ను చంపాలనే నిర్ణయం వెనుక ఎవరి హస్తం ఉంది? అసలు ఇంత కుట్ర జరగడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. త్వరలోనే నిజా నిజాలు బయటపడతాయని సమాచారం.
also read: Tollywood: ప్రొడ్యూసర్ చీకటి బాగోతం.. భార్య ఉండగానే హీరోయిన్‌తో రాసలీలలు!