Rashmika -Vijay Devarakonda: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక(Rashmika) నిశ్చితార్థం (Engagment)గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ ఇద్దరు నిన్న హైదరాబాదులోని తమ ఇంట్లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశారు. అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. అదేవిధంగా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాలేదు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం గురించి విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ టీమ్ స్పందిస్తూ.. విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమే. అయితే ఈ నిశ్చితార్థం అక్టోబర్ 4వ తేదీ శనివారం ఉదయం జరిగిందని వెల్లడించారు. వీరి నిశ్చితార్థం అక్టోబర్ మూడవ తేదీన జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదని నేడు (అక్టోబర్ 4) ఉదయం నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు అదేవిధంగా వీరిద్దరి వివాహం కూడా ఫిబ్రవరి 2026 లో జరగబోతోంది అంటూ విజయ్ దేవరకొండ టీం అధికారకంగా వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇద్దరి గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఇక వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో త్వరలోనే ఒకటి కాబోతున్నారని విషయం తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోతుందని చెప్పినప్పటికీ ఇంకా తేదీ ఫిక్స్ అవ్వలేదని తెలుస్తుంది. అయితే వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
మరోసారి జంటగా వెండితెర పైకి..
ఇక రష్మిక ఇదివరకే రక్షిత్ శెట్టి అనే హీరోతో నిశ్చితార్థం జరుపుకొని కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ బ్రేకప్ తర్వాత ఈమెకు తెలుగులో కూడా అవకాశాలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయారు అయితే విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే మరోసారి ఈ ఇద్దరు జంటగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఇటీవల ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రష్మిక నటిస్తుండటం విశేషం.