హైదరాబాద్ మాదన్నపేటలో జరిగిన ఏడేళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. స్వయంగా మేనమామ, అత్త కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో అలర్లరి చేస్తుందనే కోపంతో కాళ్లు, చేతులు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి నీళ్ల ట్యాంక్ లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. నీళ్లలో ముగిని ఊపిరాడక బాలిక ప్రాణాలు విడిచిందని వెల్లడించారు. బాలిక తల్లికి, మేనమామకు మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నిజానికి చిన్నారి హుమయేని సుమయ్యా అమ్మకు, మేనమామకు గొడవలు జరుగుతున్నా, చిన్నారి అవేమీ పట్టించుకునేది కాదు. రోజూ మామయ్య వాళ్ల ఇంటికి వెళ్లి ఆడుకునేది. కానీ, ఆ అమ్మాయి తమ ఇంటి రావడాన్ని తట్టుకోలేకపోయారు. మేనమామ తన భార్యతో కలిసి హత్య చేశారు. వారిద్దరు బాలిక గొంతు నులిమి హత్య చేసి.. చేతులు కట్టేసి నీళ్ల ట్యాంకులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మేనమామతో పాటు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మాదన్నపేటలోని ఒవైసీ ఆసుపత్రి సమీపంలో నివసించే హుమయేని సుమయ్యా (7) మంగళవారం తల్లి షబానా బేగంతో కలిసి చావ్ నీ ఏక్ ఖానా మసీదు దగ్గర ఉన్న అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చింది. రాత్రి 7 గంటల తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు. చుట్టు పక్కల అంతా వెతికారు. మరుసటి రోజు ఉదయం ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంకులో శవమై కనిపించింది. ఆమె చేతులు వెనక్కి ఉంచి కట్టేసినట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ అమ్మాయి బయటకు వెళ్లినట్లు కనిపించకపోవడంతో పోలీసులు ఇంట్లో వారి మీదే అనుమానం వ్యక్తం చేశారు. అదే కోణంలో విచారణ జరిపారు. చివరకు అసలు విషయం బయటకు వచ్చింది.
Read Also: జిమ్ ట్రైనర్ సైడ్ బిజినెస్.. దొంగలతో కలిసి దోపిడీలు.. రైల్వే ట్రాక్ పక్కన ఇళ్లే వారి టార్గెట్!
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగాదాలను చిన్న పిల్లల మీద చూపించడం ఏంటని మండిపడుతున్నారు. ఇలాంటి కిరాతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారిని కోల్పోయిన తల్లికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల కోసం మనుషుల ప్రాణాలను తీసేందుకు వెనుకడానికి వారు తమతో పాటు కలిసి ఉండటం నిజంగా ఘోరం అంటున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Read Also: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!