Rakul Preet Singh: భారతీయ ఇతిహాస గాథ రామాయణ.. ఈ చిత్రాన్ని ఈసారి ఏకంగా రూ.4వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడి గా , సాయి పల్లవి(Sai Pallavi) సీత పాత్రలో నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ హీరో యశ్ (Yash ) రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇందులో రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర ప్రముఖ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (rakul Preet Singh) పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రకుల్ ఆ పాత్రను ఎంచుకోవడం వెనుక అసలు కారణం ఏంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. రామాయణం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రామాయణ ట్రైలర్ ను అధికారికంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా విజువల్ వండర్ గా ఉంది అంటూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్లో నటీనటుల పాత్రలు ప్రేక్షకులను అశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ఒకటి. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది.
ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన ఆభరణాలు, డిజైనర్ వస్త్రధారణ విజువల్ గా చాలా రిచ్ గా ఉన్నాయని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవితో పోలిస్తూ రకుల్ ఈ చిత్రంలో చాలా అట్రాక్టివ్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా శూర్పణఖ అంటే నెగిటివ్ షేడ్స్ మాత్రమే కాకుండా ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని, విభిన్న కోణాలను దర్శకుడు చాలా అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. గ్లామర్ పాత్రలతో ఇన్ని రోజులు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు వైవిద్యమైన అవతారంలో మెప్పించడానికి సిద్ధమైందని చెప్పవచ్చు.
also read:జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని ఈ పాత్రను మీరు ఎందుకు అంగీకరించారు అని ప్రశ్నించగా.. దానికి ఆమె మాట్లాడుతూ..” శూర్పణఖ పాత్రలో ఉన్న సంక్లిష్టత నన్ను బాగా ఆకట్టుకుంది. రామాయణంలో ఆమె అనగానే కేవలం ఒకే ఒక్క ఘట్టం మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆమె కథ వెనుక ఎన్నో తెలియని విషయాలు దాగి ఉన్నాయి. ఒక నటిగా సమాజంలో ఉన్న పాత అభిప్రాయాలను మార్చే సవాళ్లతో కూడిన పాత్రలు చేయడమే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ విభిన్నమైన మాత్రను నేను ఒప్పుకున్నాను థియేటర్లలో ఈ సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఈ పాత్రను ఒక కొత్త దృక్కోణంలో అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను “అంటూ రకుల్ ఈ పాత్ర ఎంచుకోవడంపై కామెంట్లు చేసింది.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. లౌక్యం, బ్రూస్లీ , సరైనోడు, జయ జానకి నాయక వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది..మరి ఈ పాత్రతో ఎలాంటి ఇమేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.