E-Paper
Advertisement

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!
Advertisement

Tata Car Discounts August 2026: ఆగస్టు 2026కు సంబంధించి టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్ కార్లపై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో టాటా కర్వ్‌ పై అత్యధికంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. పంచ్, కొత్త 2026 టియాగో మినహా మిగతా చాలా ICE మోడళ్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు సిటీ,  డీలర్‌ షిప్, స్టాక్‌ను బట్టి మారే అవకాశం ఉంది.

టాటా కర్వ్: రూ.1.25 లక్షలు

టాటా కర్వ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌ తో పాటు లాయల్టీ బోనస్, స్క్రాపేజ్, ఎక్స్చేంజ్ బోనస్ కూడా కలిపి ఈ బెనిఫిట్స్ అందిస్తున్నారు.

టాటా సియెర్రా డీజిల్: రూ.90,000

Advertisement

టాటా సియెర్రా డీజిల్ వేరియంట్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. గరిష్టంగా రూ.90,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, లెవెల్ అప్ బోనస్ లాంటి ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బెనిఫిట్స్ డీజిల్ మోడల్‌ కే వర్తిస్తున్నాయి.

టాటా నెక్సాన్‌: రూ.75,000

దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVల్లో ఒకటైన టాటా నెక్సాన్‌పై గరిష్టంగా రూ.75,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్‌ తో పాటు ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్ కూడా ఉంది. CNG, డీజిల్ వేరియంట్లపై కూడా పలు బెనిఫిట్స్ అందిస్తున్నారు.

టాటా ఆల్ట్రోజ్: రూ.55,000

Advertisement

ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ CNG మోడల్‌ పై గరిష్టంగా రూ.55,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, ఫ్రీడమ్ ఆఫర్ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై కూడా రూ.35,000 వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.

హారియర్, సఫారీ: రూ.45,000

టాటా హారియర్, సఫారీ SUVల డీజిల్ వేరియంట్లపై రూ.45,000 వరకు బెనిఫిట్స్ ప్రకటించారు. క్యాష్ డిస్కౌంట్‌ తో పాటు ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్‌ ను కస్టమర్లు పొందవచ్చు.

ఇక టాటా టిగోర్ సెడాన్‌పై కూడా రూ.30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్,  స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. అయితే, కొత్త 2026 టాటా టియాగోపై ఎలాంటి ప్రత్యేక ఆఫర్లు లేవు. కానీ, పాత మోడల్ స్టాక్ ఇంకా మిగిలి ఉంటే వాటిపై రూ.35,000 వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.

టాటా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ నెల మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్వ్, నెక్సాన్, సియెర్రా, ఆల్ట్రోజ్ లాంటి మోడళ్లపై ఎక్కువ బెనిఫిట్స్ అందుబాటులో ఉండటంతో కస్టమర్లు ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంది.

Read Also: హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

Tags

Related News

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×