E-Paper
Advertisement

తిరుమల నడక మార్గంలో పులి కలకలం.. భయాందోళనలో భక్తులు, వైరల్ వీడియో

తిరుమల నడక మార్గంలో పులి కలకలం.. భయాందోళనలో భక్తులు, వైరల్ వీడియో
Advertisement

Tirumala Leopard: కలియుగ వైకుంఠం తిరుమల గిరులలో మరోసారి వన్యమృగాల సంచారం కలకలం రేపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్తున్న భక్తులకు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. అలిపిరి కాలినడక దారిలోని ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఒక్కసారిగా చిరుతపులి ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసిన వెంటనే ప్రాణభయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ హఠాత్పరిణామంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర ఉత్కంఠ, గందరగోళ పరిస్థితి నెలకొంది.

అప్రమత్తమైన అటవీశాఖ.. రంగంలోకి సిబ్బంది!
భక్తుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులు వేగంగా స్పందించారు. చిరుత సంచరించిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. భక్తులకు ఎటువంటి హాని కలగకుండా అప్రమత్తం చేశారు. చేతుల్లోని ఇనుప రాడ్లతో పెద్ద పెట్టున శబ్దాలు చేస్తూ, కేకలు వేస్తూ చిరుతను సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా తరిమికొట్టారు. దీంతో భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ఒంటరిగా వెళ్లొద్దు.. గుంపులుగానే నడవండి!
ఈ ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, టీటీడీ యంత్రాంగం కాలినడకన వెళ్లే భక్తులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. కొండపైకి వెళ్లే భక్తులు ఎవరూ కూడా నడక మార్గంలో ఒంటరిగా ప్రయాణించవద్దని, కనీసం 10 నుండి 15 మంది గ్రూపులుగా కలిసి నడవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని హెచ్చరించారు.

భక్తుల భద్రతకు ప్రత్యేక నిఘా
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణే తమకు ప్రథమ ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేశారు. చిరుత సంచరించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచినట్లు తెలిపారు. నడక దారి పొడవునా ఉండే సీసీ కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిభావంతో సురక్షితంగా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.

Advertisement

Also Read: ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

Related News

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?

డైరెక్షన్.. ప్రొడక్షన్ కాదు ఫైనాన్స్ కూడా.. టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం, కేవలం మూడు అంశాలను టార్గెట్ చేసిన జగన్

కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్.. జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్టులంటూ సరికొత్త పల్లవి

ఏకగ్రీవాలకు అంగీకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్.. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

జోగి రమేశ్ వ్యాఖ్యలపై కోడలు కౌంటర్.. సజ్జల కాలాయపన, గుట్టంతా బయటపెట్టిన మేఘన

Big Stories

Advertisement
×