E-Paper
Advertisement

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స.. అసలేమైంది? డాక్టర్లు ఏం చెప్పారు?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స.. అసలేమైంది? డాక్టర్లు ఏం చెప్పారు?
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబయిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. గత కొంతకాలంగా ఆయనను వేధిస్తున్న భుజాల నొప్పులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు కాగా, వైద్యులు మొదటగా ఆయన కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో అభిమానులు, జన సైనికులు ఊపిరి పీల్చుకున్నారు.

గాయాల వెనుక అసలు కారణం ఇదే..
పవన్ కళ్యాణ్ భుజాలకు ఈ తీవ్రమైన గాయాలు కావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. గతంలో 2016 లో సినిమా షూటింగ్‌ల సమయంలో ఆయనకు కొన్ని గాయాలయ్యాయి. ఆ తర్వాత జనసేన పార్టీ తరపున చేపట్టిన సుదీర్ఘ పోరాట యాత్రలు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండనక, వాననక నిరంతరం శ్రమించడంతో ఆ గాయాల తీవ్రత మరింత ఎక్కువైంది. వీటికి తోడు, ఎన్నికల ప్రచార సమయాల్లో, పర్యటనల్లో అభిమానులు ఆయనతో హ్యాండ్‌షేక్ చేయడం కోసం చేతులు పట్టి బలంగా లాగడంతో భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

రెండు నెలల తర్వాత మరో సర్జరీ..
తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం, ఎన్నికల బాధ్యతల కోసం ఈ నొప్పులను భరిస్తూనే వచ్చారు. ప్రస్తుత సర్జరీలో భాగంగా కుడి భుజానికి చికిత్స పూర్తి చేసిన డాక్టర్లు.. ఆయనకు కొంతకాలం విశ్రాంతి అవసరమని సూచించారు. ఎడమ భుజానికి ఉన్న గాయానికి కూడా శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, అయితే ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో, మరో రెండు నెలల వ్యవధి తర్వాత రెండో భుజానికి ఆపరేషన్ చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
ప్రస్తుతం ముంబయి ఆసుపత్రిలోనే ఉన్న పవన్ కళ్యాణ్, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో క్రమంగా కోలుకుంటున్నారు. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు గట్టిగా సూచించారు. పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్ అయిందన్న వార్త తెలియడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా తమ ప్రియతమ నేత ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: పసిడి ప్రియులకు ఊరట.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే!

Related News

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?

డైరెక్షన్.. ప్రొడక్షన్ కాదు ఫైనాన్స్ కూడా.. టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం, కేవలం మూడు అంశాలను టార్గెట్ చేసిన జగన్

కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్.. జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్టులంటూ సరికొత్త పల్లవి

ఏకగ్రీవాలకు అంగీకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్.. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

జోగి రమేశ్ వ్యాఖ్యలపై కోడలు కౌంటర్.. సజ్జల కాలాయపన, గుట్టంతా బయటపెట్టిన మేఘన

Big Stories

Advertisement
×