E-Paper
Advertisement

టీమిండియాకు RCB ప్లేయ‌ర్ల శాపం…ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లే ముంచేస్తున్నారు క‌ద‌రా

టీమిండియాకు RCB ప్లేయ‌ర్ల శాపం…ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లే ముంచేస్తున్నారు క‌ద‌రా
Advertisement

RCB Curse On Team India: ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతులలో టీమిండియా సిరీస్ లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కాగా… ఇంగ్లాండ్ చేతిలో 3-0 తేడాతో ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయింది. ఈ రెండు జట్ల మధ్య శనివారం మరో కీలక మ్యాచ్ ఉంది. ఇది కూడా దొబ్బితే.. వైట్ వాష్ కావడం గ్యారెంటీ. ఈ లెక్కన రెండు వారాల్లో రెండు సిరీస్ లు టీమిండియా కోల్పోయినట్లు అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అతగాడి చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోతూ వస్తోందని మండిపడుతున్నారు. సరైన టీం సెలక్షన్ చేయలేక.. తనకు నచ్చిన ఫేవరెట్ ప్లేయర్లను మాత్రమే గంభీర్ తీసుకుంటున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా ఓడిపోయి, దిగజారుతోందని ఫైర్ అవుతున్నారు. అయితే టీమిండియాపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శాపం తగిలిందని మరి కొంతమంది అంటున్నారు. ఆ జట్టులో కొంతమంది ప్లేయర్లు అద్భుతంగా రాణించినప్పటికీ… ఆ ఆటగాళ్లను గంభీర్ తీసుకోకపోవడంతో టీమిండియా ఓడిపోతోందని అంటున్నారు.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

టీమిండియాకు RCB ప్లేయ‌ర్ల శాపం

Advertisement

టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్స్ శాపమే, టీమిండియా పై పడిందని అంటున్నారు. అందుకే వరుసగా రెండు సిరీస్ లు ఓడిపోయిందని విమర్శలు చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, కృనాల్ పాండ్యా, RCB కెప్టెన్ రజత్ పాటిదార్, లాంటి క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించారు. వీళ్ళు ఆడడం వల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండుసార్లు ఛాంపియన్ అయింది. ముఖ్యంగా ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ మిడిల్ ఆర్డర్ లో వచ్చి చాలాసార్లు జట్టును గెలిపించాడు. మిడిల్ ఓవర్సులో 200 స్ట్రైక్ రేట్ సాధిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అలాంటి వాడిని కూడా పట్టించుకోలేదు గంభీర్. ఇటు భువనేశ్వర్ కూడా లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. కృనాల్ పాండ్యా, రసిక్ కూడా అద్భుతంగా రాణించినప్పటికీ గంభీర్ వీళ్లను పట్టించుకోకుండా… గుజరాత్ టైటాన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ జట్టులో అడపాదడపా ప్రదర్శన కనబరిచిన వాళ్లను సెలెక్ట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, శివం దుబే, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా లాంటి క్రికెటర్లకు అవకాశాలు ఇస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడు గంభీర్.

జాకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ ఇద్ద‌రే కొంప‌ముంచుతున్నారు

అయితే ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా ఓటమికి ముఖ్య కారణాలు జాకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్. ఈ ఇద్దరు అద్భుతంగా ఇంగ్లాండ్ తరఫున రాణించిన నేపథ్యంలో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ ఇద్దరు క్రికెటర్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన వాళ్లే. తమ తోటి క్రికెటర్లను గంభీర్ సెలెక్ట్ చేయనందుకు గాను.. అదే బెంగుళూరు జట్టుకు ఆడిన సాల్ట్, జాకబ్ ఇద్దరూ రెచ్చిపోయి ఆడుతున్నారని అంటున్నారు. బెంగళూరు వాళ్లకు అన్యాయం చేస్తే.. అదే RCB జట్టుకు సంబంధించిన ప్లేయర్లు టీమిండియాను ఓడిస్తున్నారని కోణంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందుకే బెంగళూరు శాపం గంభీర్ కు తగిలిందని అంటున్నారు. అతని పదవి పోయే సమయం కూడా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

 

Related News

రోకో కాంబోను త‌ట్టుకోలేం…ఆసియా కప్ 2027 టీ20 ఫార్మాట్ లో నిర్వ‌హించాల్సిందే

రోనాల్డో కంటే ధోనికే ఎక్కువ ఫ్యాన్స్‌..కోహ్లీ, రోహిత్ లు కూడా జుజుబీ

మ‌ళ్లీ ఛాన్స్ రాదు..ఇప్పుడే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలి

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేక‌పోతే, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేము

ఐసీసీతో కుమ్మ‌క్కు..అందుకే టీమిండియాకు మూడు ట్రోఫీలు..ఫ్లాట్ పిచ్ లు రెడీ చేసి కుట్ర‌లు!

బికినీ భామ‌తో వీరేంద్ర సెహ్వాగ్..హాట్ ఫోటోలు వైర‌ల్ !

టీమిండియా ప‌త‌నం మొద‌లైంది..ఏషియ‌న్‌ గేమ్స్, 2027 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ఓడిస్తాం

Big Stories

Advertisement
×