BigTV English

Anganwadi Strike : ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల పోరు.. మంత్రి జోగి రమేష్ ఇంటి ముట్టడి..

Anganwadi Strike : ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల పోరు.. మంత్రి జోగి రమేష్ ఇంటి ముట్టడి..
breaking news in Andhra Pradesh

Anganwadi workers strike(Breaking news in Andhra Pradesh):

ఆంధ్ర ప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగులు పోరాటం ఉద్ధృతంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్ వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీల పై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.


మంత్రి జోగి రమేష్ బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకు ముందు రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్డులోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్.శ్రీనివాస్, సీఐటీయూ ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం.మహేష్, సిహెచ్.సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు.


Related News

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Big Stories

×