Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా షారుక్ ఖాన్ కి ఉన్న క్రేజ్ వేరు. షారుక్ ఖాన్ సినిమాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా మందిని విపరీతంగా ఆకర్షిస్తాయి.
కొన్ని విషయాలపై ఆయనకు ఉండే ఆలోచన విధానం చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామంది ప్రేక్షకులకు తమ హీరో యొక్క వారసత్వాన్ని కూడా ఇష్టపడడానికి ముందుంటారు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను కూడా అదేవిధంగా ఆదరిస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్రన్ కాలిఫోర్నియాలో (University of Southern California), స్కూల్ ఆఫ్ సినీమాటిక్ ఆర్ట్స్ (School of cinematic arts) అలానే ఫిల్మెంట్ టెలివిజన్ ప్రొడక్షన్లో (film and television production) బి ఎఫ్ ఐ పట్టా తీసుకున్నారు.
షారుక్ ఖాన్ నటుడుగా మెప్పిస్తే ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. “The Ba**ds of Bollywood” అనే వెబ్ సిరీస్ తో దర్శకుడుగా మారాడు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫిక్స్డ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో ఎస్.ఎస్ రాజమౌళి, అమీర్ ఖాన్ ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఎస్.ఎస్ రాజమౌళిని ఒప్పించారు అంటే అది మామూలు విషయం కాదు. ఈ ఒప్పించడం వెనక అసలైన కారణాన్ని నటి అన్య సింగ్ బయటపెట్టారు.
దర్శకులు నటించడానికి సాధారణంగా ఒప్పుకోరు. అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడు ఒప్పుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. “ముంబైలోని ఒక స్టూడియోలో ఆర్యన్ షూటింగ్ చేస్తున్నాడు. ఆ తరుణంలో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అమీర్ ఖాన్ (Aamir Khan) ఆ స్టూడియో చూడటానికి వచ్చారు. ఆ తరుణంలో నేను 20 నిమిషాల్లో ఒక సీన్ రాస్తాను మీరు వెళ్లి కాస్ట్యూమ్ మార్చుకొని వచ్చేయండి అంటూ అన్యాసింగ్ వాళ్లకి ఆర్యన్ చెప్పాడు. వాళ్లు అలా కాస్ట్యూమ్ తో రెడీ అయి రాగానే, అమీర్ ఖాన్ రాజమౌళి కు సీన్ చెప్పేసి, ఒప్పించడమే కాకుండా యాక్టింగ్ చేయించడం కూడా అయిపోయిందట” ఈ విషయాన్ని రీసెంట్ గా అన్య సింగ్ తెలియజేశారు.
Also Read: Parag Tyagi : తనని మర్చిపోలేక పోతున్నాను, పడుకునేటప్పుడు ఆమె బట్టలు పక్కలోనే..