అత్యంత వేగం, అత్యాధునికి సౌకర్యాలకు మారుపేరు అయిన వందేభారత్ రైళ్లలో గడువు తీరిన ఫుడ్ అందించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గత కొంత కాలంగా వందేభారత్ రైళ్లలోనూ అందించే ఫుడ్ నాణ్యత విషయంలో లోపాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు చెడిపోయిన ఆహారాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా వందే భారత్ అందించిన ఫుడ్ విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. గడువు తీరిన ఫుడ్ అందించారంటూ ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెల రోజుల క్రిం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు విస్తృతంగా షేర్ అవుతోంది. ఫుడ్ తో పాటు కెచప్ ప్యాకెట్లపై గడువు తేదీ గురించి ప్యాంట్రీ సిబ్బందితో ఒక ప్రయాణీకుడు వాదిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కోపంతో నిప్పులు చెరుగుతూ కనిపించాడు. “నాకు గడువు ముగిసిన కెచప్ ఎలా ఇచ్చావు? దాన్ని ఎలా స్టాక్ లో ఉంచావు? ఇంత మంది ప్రయాణికులు చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు?” అంటూ మండిపడుతూ కనిపించాడు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో పోలీసులతో పాటు TTE స్పాట్ కు చేరుకున్నారు. అతడిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ, సదరు ప్రయాణీకుడు వెనక్కి తగ్గలేదు. “మీ పని మీరు చేసుకోండి” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇది రైలు అంతటా జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల గడువు ముగిసిన కెచప్ మాత్రమే కాదు, పాత ప్యాకెట్లను కూడా ఇస్తున్నారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం సూపరింటెండెంట్ బాధ్యత. లేకపోతే, నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది” అంటూ ఆ వీడియోలో చెప్పడం కనిపిస్తుంది.
కేవలం 41 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రయాణీకుడి కోపం, ప్రశ్నలను స్పష్టంగా చూపిస్తుంది. గోరఖ్ పూర్ నుంచి పాటలీపుత్ర వరకు నడుస్తున్న వందేభారత్ రైలులో 2-3 సంవత్సరాల గడువు తీరిని ఫుడ్ అందించడం వివాదం అయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియో 3.4 మిలియన్లకు పైగా వీక్షించారు. దాదాపు 1.38 లక్షల లైక్‌లు, 2,000 కంటే ఎక్కువ కామెంట్స్ వచ్చాయి.
Read Also: ఏకంగా రైల్లోనే బట్టలు ఆరేశాడు, నువ్వు ఓ వర్గానికి ఇన్ స్ప్రేషన్ బ్రో!
ఇక ఈ వీడియో క్లిప్ వైరల్ అయిన వెంటనే, IRCTC స్పందించింది. “సర్, మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నారు. ప్యాకేజీ చేయబడిన అన్ని వస్తువులను వాటి గడువు తేదీలను తనిఖీ చేయకుండా అందించవద్దని ఆన్-బోర్డ్ క్యాటరింగ్ సూపర్‌వైజర్‌కు కఠినమైన సూచనలు ఇవ్వబడ్డాయి. మేము మీకు ఎల్లప్పుడూ ఉత్తమ సేవను అందిస్తాము” అని వెల్లడించింది. అటు ఇలాంటి ఫుడ్ అందించిన వారికపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Also:అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!