CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 15 నెలల కాలంలో అన్ని రంగాలలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలను రంగాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో సీఎం వివరించారు.
అత్యధికంగా ప్రైవేట్ రంగంలో..
ప్రైవేట్ రంగంలో అత్యధికంగా 3,48,891 ఉద్యోగాలు కల్పించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ఇందులో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎస్‌ఎంఈ (MSME), పునరుత్పాదక విద్యుత్ వంటి రంగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 92,149 మందికి ఉద్యోగం వచ్చినట్టు చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9093 మంది ఉద్యోగం సాధించారని వివరించారు. పోలీసు శాఖలో 6100 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు..
ప్రైవేట్ రంగంలో: 3,48,891 మందికి ఉద్యోగాలు
జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్ మెంట్: 92,149 మందికి ఉద్యోగాలు
మెగా డీఎస్సీ: 15,941 మందికి ఉద్యోగాలు
వివిధ ప్రభుత్వ విభాగాలు: 9093 మందికి ఉద్యోగాలు
పోలీస్ శాఖలో: 6100 మందికి ఉద్యోగాలు
వర్క్ ఫ్రమ్ హోమ్: 5500 మందికి ఉద్యోగాలు
పొర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో..
మొత్తంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఈ 15 నెలల పాలనలో సుమారు 4.7 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్టున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ ఉద్యోగి ఎక్కడ, ఎప్పుడు ఉద్యోగం పొందారనే పూర్తి వివరాలను ఒక పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కూడా ఆయన తెలిపారు.
ALSO READ: RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు
హైవేల నిర్మాణంలో ఏపీ రెండో స్థానం..
అంతేకాకుండా, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రూ. 6.23 లక్షల కోట్ల పెట్టుబడులకు 10 ఎస్ఐపీబీ (State Investment Promotion Board – SIPB)ల ద్వారా ఆమోదం లభించిందని, ఇది భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో హైవేల నిర్మాణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, లక్షన్నర కోట్ల విలువైన జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.
ALSO READ: Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు