BigTV English

Bigg Boss 9: కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్, ఒక మెట్టు ఎక్కేసావయ్యా ఇమ్మానియేల్

Bigg Boss 9: కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్, ఒక మెట్టు ఎక్కేసావయ్యా ఇమ్మానియేల్

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. ట్విస్టులు మీద ట్విస్టులు బిగ్ బాస్ అందిస్తున్నారు. చదరంగం కాకుండా రణరంగం అన్నట్లే ఈ షో కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా సంజన బయటకు వెళ్లిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ సీక్రెట్ రూమ్ నుంచి అందరినీ అబ్జర్వ్ చేసి అందరి రంగులు తెలుసుకుంది సంజన.


ఈ రోజు విడుదలైన ఒక ప్రోమోలో కూడా అందరికీ క్లాస్ పీకింది. ముఖ్యంగా రాము రాథోడ్ ను బిడ్డ అంటూ నెక్స్ట్ లెవెల్ వార్మింగ్ ఇచ్చింది. అన్నిటిని మించి ఇమ్మానుయేల్ ఎమోషనల్ అయిపోతుంటే, సంజన కూడా మరోసారి స్టేజ్ పైన ఎమోషనల్ అయిపోయింది.

లేటెస్ట్ ప్రోమో 

ఇక రీసెంట్ గా ఒక ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమోలో సంజనను మళ్లీ హౌస్ లోపలకు పంపించే అవకాశం కూడా హౌస్ మేట్స్ కు అందించారు నాగార్జున. అయితే వీటికోసం కొన్ని కండిషన్స్ పెట్టారు. రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం ఇమ్మానుయేల్ తన కెప్టెన్సీను వదులుకోవాలి. శ్రీజ ఒక జత బట్టలు మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ రిటర్న్ ఇచ్చేయాలి. రీతు చౌదరి తన హెయిర్ కట్ చేసుకోవాలి. సుమన్ శెట్టి స్మోకింగ్ ను వదిలేయాలి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అయితే ఈ కండిషన్స్ లో సుమన్ శెట్టి నేను వదులుకోలేను అని తెగించి చెప్పేసాడు. మరోవైపు శ్రీజ కూడా ఒప్పుకోలేదు. రీతు బాధపడుతుంది.


ఇమ్మానుయేల్ ఒక మెట్టెక్కాడు 

బిగ్బాస్ హౌస్లో చాలామందికి ఉన్న ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే టక్కును వినిపించే పేరు ఇమ్మానుయేల్. ఈవారం కూడా ఇమ్మానుయేల్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. ఇమ్మానుయేల్ కెప్టెన్సీ ని వదులుకుంటే సంజన లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఈ లాజిక్ ప్రకారం సంజన కోసం ఇమ్మానుయేల్ కెప్టెన్సీ వదులుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇమ్మానుయేల్ వలన 25% బ్యాటరీ పెరిగింది. కొత్త కెప్టెన్ గా డీమోన్ పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందా? బయటకు వెళ్లిపోయిందా అనేది నేటితో తెలుస్తుంది. కానీ ఇమ్మానుయేల్ కెప్టెన్సీ వదులుకోవడం వలన ఆడియన్స్ దృష్టిలో కూడా ఒక మెట్టెక్కాడు అని చెప్పాలి.

Related News

Bigg Boss 9 Promo: అంత చీప్‌గా కనిపిస్తున్నానా.. ఇలాంటి మనిషితో ఉండలేం.. హరీష్‌, రాముని కడిగిపారేసిన సంజన!

Bigg Boss 9 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌ కాదు.. సింగిలే, మూడో వారం కామనర్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo: లత్కోర్ హరీష్.. ఇచ్చి పడేసిన నాగ్.. ఇకనైనా మారండ్రా బాబు!

Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్, బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్

Bigg Boss 9: హౌస్ మేట్స్ క్యారెక్టర్స్ బయటపెట్టిన దివ్య, అందరినీ పకడ్బందీగా అబ్జర్వ్ చేసింది

Bigg Boss 9 Promo: అమాయకుడు కాస్త అపరిచితుడు అయ్యాడు, తనుజను లోపలికి పిలిచిన సుమన్ శెట్టి

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Big Stories

×