BigTV English

AP: KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనితా

AP: KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనితా

AP: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా కురూపం మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో గత వారం నుంచి పచ్చకామెర్లు (జాండిస్) వ్యాధి వ్యాప్తి చెందడం కలకలం రేపింది. అయితే ఈ పాఠశాలలో చదువుతున్న సుమారు 121 మంది బాలికలు ఈ వ్యాధికి గురైనట్లు తెలిపారు.. ఇందులో 36 మంది విద్యార్థినులను తీవ్ర పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని విశాఖపట్నం‌లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు మార్చారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మరణించారు, మిగిలిన వారు జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనకు అధికారులు నీటి నాణ్యత, ఆహార సరఫరా, ఆవాస సదుపాయాలపై అనుమానం వ్యక్తం చేస్తన్నారు. దీంతో రాష్ట్ర స్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. నీటి నమూనాలు పరీక్షలకు పంపబడ్డాయి, అలాగే పాఠశాలలో ఆరోగ్య జాగ్రత్తలు మరింత బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోమ్ మంత్రి..
ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించడంతో పాటు, రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనితా సోమవారం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మంత్రి సంధ్యారాణి ఆదివారం ఈ బాలికలను సందర్శించినట్లు తెలిపారు. అనితా మంత్రి వైద్యులతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, చికిత్స పద్ధతులు, అవసరమైన మందులు, సదుపాయాల గురించి వివరంగా చర్చించారు.

కురూపం ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న అనిత
మీడియాతో మాట్లాడిన అనితా, కురూపం ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కింద గిరిజన విద్యార్థుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అధికారులు నిరంతరం పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. వైద్య నిపుణుల కమిటీ సమగ్ర విచారణ జరుపుతోందని, ఘటనకు కారణాలు తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


వైసీపీ హయంపై విమర్శలు గుప్పించిన హోం మంత్రి అనిత..
హోమ్ మంత్రి అనితా తన పర్యటన సందర్భంగా వైసీపీ హయాంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో కల్తీ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, జంగారెడ్డిగూడెం వంటి ఘటనలు గుర్తు చేస్తూ, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని ఫైర్ అయ్యారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న కుక్కలు.. రేబిస్ వ్యాధితో మరో బాలుడు మృతి

పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్న హోమ్ మంత్రి..
గత ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులు డెప్యూటీ సీఎంలుగా ఉన్నప్పటికీ, ఆశ్రమ పాఠశాలలను సందర్శించలేదని ప్రశ్నించారు. కానీ ఎన్‌డీఏ ప్రభుత్వం కింద మంత్రులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, మహిళా భద్రతకు మరింత శ్రద్ధ చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా కేజీహెచ్‌లో బాలికలను పరామర్శించారు, కానీ ప్రభుత్వ వైఖరిని స్వాగతించారు.

Related News

Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో

Cough Syrup: ఆ కల్తీ దగ్గు మందు ఏపీలో సరఫరా కాలేదు.. మందుల నాణ్యతపై నిఘా: మంత్రి సత్యకుమార్

Nara Lokesh: ఏపీలోని ఈ నగరాల్లో ఇంజినీరింగ్ సెంటర్లు.. టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

CM Progress Report: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Big Stories

×