Kakinada District: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తేటగుంట జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఒక యువకుడు లారీ కింద పడిపోయినా, అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతోనే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాలు..
సోమవారం.. మధ్యాహ్నం 3:04 గంటల సమయంలో తేటగుంట జాతీయ రహదారిపై ఒక క్రషర్ మిల్లర్ లారీ రోడ్డుకు పక్కకు తిరిగే ప్రయత్నంలో ఉంది. ఈ సమయంలో అనకాపల్లి జిల్లా అరట్లకోట గ్రామానికి చెందిన 28 ఏళ్ల నరేంద్ర అనే యువకుడు తన బైక్‌పై వేగంగా వస్తున్నాడు. అతడు లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించా, లారీ ఎదురు భాగం అతని బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి నరేంద్ర రోడ్డుపై పడిపోయాడు. తర్వాత లారీ అతని శరీరం పైనుంచి నాలుగు చక్రాలతో వెళ్ళిపోయింది. కానీ, నరేంద్ర అద్భుతంగా తప్పించుకున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. అతను కొంచెం పక్కకు తల పెడితే అతని తల భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యేది.. అతడు కింద పడిన వెంటనే లేచి కూర్చుని, చుట్టూ చూస్తూ లేచి నడిచాడు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు మొదట భయపడ్డారు, తర్వాత అతడు సురక్షితంగా ఉన్నట్టు తెలిసి సంతోషించారు.
నరేంద్ర అరట్లకోట గ్రామంలోనే ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి, సంబరాలు, ఇతర కార్యక్రమాల కవరేజ్ చేసి జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు కూడా ఒక పెళ్లి కవరేజ్ పని కోసం అనకాపల్లి నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడి కుటుంబం ఈ ఘటన తెలిసిన తర్వాత భయబ్రాంతుల్లో పడింది. ప్రమాదం తర్వాత అతడు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, త్వరలోనే డిశ్చార్జ్ అవుతానని చెబుతున్నాడు.
Also Read: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..
తేటగుంట పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, లారీ డ్రైవర్‌పై కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. డ్రైవర్‌కు ఆల్కహాల్ ప్రభావం లేదని, కానీ సిగ్నల్ లేని జంక్షన్‌లో పక్కకు తిరగడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు. పోలీసులు డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేస్తూ, ఓవర్‌టేక్ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, జంక్షన్‌లలో వేగం తగ్గించాలని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడిన ఓ యువకుడు
కాకినాడ జిల్లా తేటగుంట జాతీయ రహదారిపై లారీని తప్పించబోయి దాని కింద పడిపోయిన నరేంద్ర అనే యువకుడు
అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడిన యువకుడు
సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన రోడ్డు ప్రమాద దృశ్యాలు pic.twitter.com/4dwQNKb10V
— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2025