AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 79.7మి.మీ, పల్నాడు జిల్లా గుట్లపల్లిలో 60 మి.మీ, నెల్లూరు జిల్లా జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైంది.
రానున్న మూడు గంటలు పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడవచ్చని, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అక్టోబర్ 6న ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
Also Read: CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు
రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.