E-Paper
Advertisement

RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు

RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు
Advertisement

RRB JE POSTS: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ రైల్వేలో పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. డిగ్రీ లేదా బీఈ, బీటెక్ లేదా డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం  ఉంటుంది. ఈ ఉద్యోగం సాధిస్తే బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. వేతనంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నోట్: దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30

Advertisement

ఇండియన్ రైల్వేలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 2570 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 2570

Advertisement

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

విద్యార్హత: జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు మూడేళ డిప్లొమా కోర్సు(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్) లేదా బీఈ, బీటెక్ డిగ్రీ పాసై ఉండాలి. డీఎంస్ ఉద్యోగాలకు ఏ విభాగంలో అయినా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. సీఎంఏ పోస్టులకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో బీఎస్సీ డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులతో పాసై ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 31

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 30

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి సాలరీ ఉంటుంది. నెలకు రూ.35,400 జీతం ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. రైల్వే ఉద్యోగులకు ఫ్యామిలీ ట్రైన్ పాస్, మెడికల్, విద్యా సాయం, NPS వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: సీబీటీ-1, సీబీటీ-2 ద్వారా ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2570

దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30

ALSO READ: RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×