E-Paper
Advertisement

AOB Encounter: రంపచోడవరంలో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోలు హతం, వారిలో అగ్రనేత?

AOB Encounter:  రంపచోడవరంలో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోలు హతం, వారిలో అగ్రనేత?
Advertisement

AOB Encounter: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడవులను పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్ నుంచి మావోయిస్టులు తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినట్టు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం నుంచి గాలింపు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం మావోయిస్టుల కీలక నేత హిడ్మా హతం కాగా, బుధవారం ఉదయం భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

రంపచోడవరంలో భారీ ఎన్‌కౌంటర్

Advertisement

ఈ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది.  మృతుల్లో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ, ఆజాద్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హిడ్మా ప్రధాన అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ విషయాన్ని ధ్రువీకరించారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా. దీనికి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో బెంబేలెత్తుతున్నారు మావోయిస్టులు. ఈ క్రమంలో తలదాచుకునేందుకు అక్కడి నుంచి ఏపీ, తెలంగాణ వైపు వస్తున్నారు. కొంతమంది మావోయిస్టుల సరెండర్ నేపథ్యంలో షెల్టర్ కోసం తెలుగు రాష్ట్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌ఘడ్, ఒడిషా సరిహద్దులతో కలిగి ఉన్న జిల్లాల్లో పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు.

Advertisement

ఏడుగురు మావోలు హతం, వారిలో అగ్రనేత?

గడిచిన నాలుగురోజులుగా పోలీసులు వివిధ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రంపచోడవరం ఏజెన్సీలోని  బీఎం వలస ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.  బలగాలు-మావోయిస్టులకు దాదాపు నాలుగైదు గంటల సేపు భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  మృతుల్లో మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రనేత దేవ్ జీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడా లేక లొంగిపోయాడా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.

ALSO READ:  తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అధికారులు కీలక సూచనలు

మృతులను గుర్తించారు. అందులో ఒకరు శ్రీకాకుళానికి చెందిన జోగారావు ఉన్నాడు. అతడ్ని టెక్ శంకర్‌గా పిలుస్తారు. ఏవోబీ అతడు చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు పురుషులు,  మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిలో జ్యోతి, సురేశ్, గణేష్, శ్రీను, అనిత, షమ్మి ఉన్నారు.  డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పని చేసింది జ్యోతి. మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీం చీఫ్, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేశ్ అలియాస్ రమేశ్, జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ ఉన్నాడు.

జాగరగొండ డిప్యూటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను, జాగరగొండ డివిజినల్ కమిటీ సభ్యురాలు అనిత, మరో సభ్యురాలు షమ్మి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ ఎన్‌కౌంటర్‌లో మరణించాడన్న వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. మంగళవారం ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 19 మంది తప్పించుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.  ఈ ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో బుధవారం జరిగింది. ఈ నేపథ్యంలో కూంబింగ్ ముమ్మరం చేశారు పోలీసులు.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×