BigTV English

Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..

Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..
Another cheetah caught in tirumala

Another cheetah caught in tirumala(Andhra Pradesh today news):

తిరుమల నడకదారిలో ఫారెస్ట్‌ అధికారుల చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిరుత పులులు ఒక్కొక్కటిగా బోనులో చిక్కుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. ఈ విషయాన్ని అటవీశాఖ, టీటీడీ అధికారులు వెల్లడించారు. అలిపిరి కాలినడక మార్గంలో ఇటీవల 6 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత ప్రాణాలు కోల్పోయింది. నెలన్నర ముందు ఓ బాలుడిని చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.


బాలికపై చిరుత దాడి ఘటన తర్వాత అటవీశాఖ సిబ్బంది, టీటీడీ అధికారులు చిరుతలను బంధించే చర్యలు చేపట్టారు. కాలినడక మార్గంలో 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మోకాలిమిట్ట, 35వ మలుపు వద్ద బోన్లు అమర్చారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులోకి వచ్చి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది. ఈ చిరుతను కూడా జూకు తరలించి అబ్జర్వేషన్‌ లో ఉంచారు. 50 రోజుల వ్యవధిలో మొత్తం 3 చిరుతలను బంధించారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×