BigTV English

Rain alert in telangana : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..?

Rain alert in telangana : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..?
Telangana rainfall news

Telangana rainfall news(TS news updates):

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18న ఏర్పడుతుందని తెలిపింది. ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి సగటున 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఆ ఆవర్తన ప్రభావంతో ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ వివరించింది.


అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి వర్షాలు ఎక్కవగా పడతాయని వెల్లడించారు. ఆగస్టులో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు సరిగా కురవలేదు.

జూలైలో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాల సీజన్‌లో ప్రస్తుతానికి 47.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటికే 58.37 సెంటీమీటర్ల సగటు వర్షపాతం రికార్డైంది.


తెలంగాణలో ఆగస్టు మూడో వారం నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తాయమని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×