E-Paper
Advertisement

Viveka Murder Case : ఆ వాంగ్మూలం తప్పు.. హైకోర్టులో ఏపీ సీఎం ప్రధాన సలహాదారు పిటిషన్..

Viveka Murder Case : ఆ వాంగ్మూలం తప్పు.. హైకోర్టులో ఏపీ సీఎం ప్రధాన సలహాదారు పిటిషన్..
Advertisement

Viveka Murder Case : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 30న సీబీఐ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన వాంగ్మూలంపై ఏపీ సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం అభ్యంతరం తెలిపారు. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ వాంగ్మూలంలో ఏముందంటే.. లోటస్‌పాండ్‌లో ఉండగా ఉదయం 5.30 గంటలకు అటెండర్‌ తలుపు కొట్టారని అజేయం కల్లాం తెలిపారని సీబీఐ పేర్కొంది. వైఎస్‌ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్‌ జగన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. బయటకు వెళ్లి 10 నిమిషాల తర్వాత జగన్‌ మళ్లీ వచ్చారని వివరించారు. బాబాయ్‌ ఇక లేరనే విషయాన్ని జగన్‌ నిలబడే చెప్పారంటూ అజేయ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ జూన్‌ 30న హైకోర్టుకు సమర్పించింది.

Advertisement

తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా నమోదు చేసిందని పేర్కొంటూ.. తాజాగా అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జిషీట్‌ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరారు. తన వాంగ్మూలం విషయంలో మళ్లీ విచారణ జరిపేలా సీబీఐను ఆదేశించాలని పిటిషన్‌లో అజేయ కల్లం కోరారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×