BigTV English

Uttam Kumar Reddy : BRSలో చేరికపై ఉత్తమ్ క్లారిటీ.. ఆ వ్యక్తే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం..

Uttam Kumar Reddy : BRSలో చేరికపై ఉత్తమ్ క్లారిటీ.. ఆ వ్యక్తే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం..
Uttam Kumar Reddy news

Uttam Kumar Reddy news(Telangana congress party news): టీపీసీసీ మాజీ అధ్యక్షుడు , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఆయన కారెక్కుతారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే ఒకసారి ఈ వార్తలను ఆయన ఖండించారు. పార్టీ వీడుతున్నారనే వార్తలపై తాజాగా మరోసారి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పందించారు.


తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నాననే వార్తలు పూర్తి అవాస్తమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌‌లో కీలక స్థానంలో ఉన్న వ్యక్తే తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. 24 గంటలు.. 365 రోజులు ప్రజల కోసం పని చేస్తున్న తనను రెండేళ్లుగా టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన అనచురులను అణగదొక్కడం, తొలగించడమే లక్ష్యంగా ప్రచారం జరుతోందని ఫైర్ అయ్యారు ఉత్తమ్.

పార్టీలో జరిగి కొన్ని పరిణామాలపై అసంతృప్తి ఉన్నా కూడా ఎక్కడా మాట్లాడలేదన్నారు. ఇప్పటివరకు అధికారిక కార్యక్రమాల్లో మినహా, కేసీఆర్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపార ఒప్పందాలు, భూ లావాదేవీలు లేవన్నారు ఉత్తమ్.


ప్రాణాలను పణంగా పెట్టి మరీ దేశ రక్షణ కోసం పనిచేసినందుకు గర్విస్తానన్నారు. ప్రజా జీవితంలో ఉండేందుకే స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానన్నారు. పార్టీ కోసం తన సమస్తాన్ని ధారపోశానంటూ ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×